రేపటి నుంచి ఒంటిపూట బడులు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం టీచర్ల ఎమ్మెల్సీలతో, విద్యాశాఖ ఉన్నతాధికారులతో, ఉపాధ్యాయ సంఘం నాయకులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఎండల తీవత్ర దృష్ట్యా ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే స్కూల్స్‌కు హాజరుకావల్సిందిగా తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఉన్నతాధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. […]

Update: 2021-04-06 09:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం టీచర్ల ఎమ్మెల్సీలతో, విద్యాశాఖ ఉన్నతాధికారులతో, ఉపాధ్యాయ సంఘం నాయకులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఎండల తీవత్ర దృష్ట్యా ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే స్కూల్స్‌కు హాజరుకావల్సిందిగా తెలిపారు.

ఈ మేరకు అన్ని జిల్లాల ఉన్నతాధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. కాగా కరోనా వల్ల తెలంగాణలో స్కూల్స్ బంద్ అవ్వగా.. ఆన్‌లైన్ క్లాసుల కోసం టీచర్లు యథావిధిగా స్కూల్స్‌కి వస్తున్నారు.

Tags:    

Similar News