‘రాత్రుల్లో కర్ఫ్యూ విధించేందుకు పరిశీలిస్తున్నాం’

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రుల్లో కర్ఫ్యూ విధించే అంశం పరిశీలనలో ఉన్నదని, పరిస్థితిని అనుసరించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. గత వారం రోజుల్లో ఢిల్లీలో 6000కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. కరోనాను అదుపు చేయడం కోసం రాత్రులు లేదా వారాంతంలో కర్ఫ్యూ […]

Update: 2020-11-26 09:52 GMT

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రుల్లో కర్ఫ్యూ విధించే అంశం పరిశీలనలో ఉన్నదని, పరిస్థితిని అనుసరించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. గత వారం రోజుల్లో ఢిల్లీలో 6000కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. కరోనాను అదుపు చేయడం కోసం రాత్రులు లేదా వారాంతంలో కర్ఫ్యూ విధించడం వంటి చర్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయా? దేశంలోని చాలా నగరాల్లో ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు కదా అని వివరణ కోరింది. కర్ఫ్యూ విధించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కానీ, ఆ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, పరిస్థితులను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.

Tags:    

Similar News