24 గంటల్లో 49,931 పాజిటివ్‌లు

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో ఒక్కరోజులో నమోదయ్యే కరోనా కేసుల్లో మళ్లీ కొత్త రికార్డు నమోదైంది. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24గంటల్లో అత్యధికంగా 49,931 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఒక్కరోజు వ్యవధిలో రికార్డైన గరిష్ట కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 14,35,453కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి ఒక్కరోజే 708 మంది మరణించారు. […]

Update: 2020-07-27 11:38 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో ఒక్కరోజులో నమోదయ్యే కరోనా కేసుల్లో మళ్లీ కొత్త రికార్డు నమోదైంది. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24గంటల్లో అత్యధికంగా 49,931 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఒక్కరోజు వ్యవధిలో రికార్డైన గరిష్ట కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 14,35,453కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి ఒక్కరోజే 708 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 32,771కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా మరణాల్లో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 9,17,568 మంది కోలుకోగా ప్రస్తుతం 4,85,114 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా తీవ్రస్థాయిలో కొనసాగుతుండగా ఢిల్లీలో భారీగా తగ్గుముఖం పడుతోంది. ఇక్కడ ఒక్కరోజులో నమోదయ్యే కేసుల సంఖ్య ట్రిపుల్ డిజిట్‌లోకి పడిపోయి కేవలం 613పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కొత్త కేసులతో కలిపి ఇక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,31,229కి చేరింది. 26కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 3853 మంది చనిపోయారు. మహారాష్ట్రలో 8706 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,83,723కు వెళ్లింది. 24గంటల్లో 227 మంది చనిపోగా మొత్తం మరణాలు 13,887కు చేరాయి. తమిళనాడులో 6993 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,20,716కు చేరింది. 77మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3,571కి చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం 56,874 కేసులకు గాను భారీ స్థాయిలో 2,348 ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో గడిచిన 24గంటల్లో 6051 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,349కి చేరింది. ఒక్కరోజే 49 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 1090మంది మృత్యువాత పడ్డారు.

Tags:    

Similar News