ఎన్‌టీపీసీ నికర లాభం రూ. 3,504 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ నికర లాభం 7.43 శాతం వృద్ధిని సాధించి రూ. 3,504 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 3,262.44 కోట్ల లాభాలను ఆర్జించింది. సోమవారం త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ బోర్డు రూ. 115 వద్ద 19.78 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కోనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. కఠినంగా అమలవుతున్న బైబ్యాక్ నిబంధనల నుంచి మినహాయింపు […]
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ నికర లాభం 7.43 శాతం వృద్ధిని సాధించి రూ. 3,504 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 3,262.44 కోట్ల లాభాలను ఆర్జించింది. సోమవారం త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ బోర్డు రూ. 115 వద్ద 19.78 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కోనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. కఠినంగా అమలవుతున్న బైబ్యాక్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని అక్టోబర్‌లో ఎన్‌టీపీసీ సెబీని కోరిన సంగతి తెలిసిందే. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 28,677.64 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 26,568.62 కోట్లుగా నమోదైంది. అలాగే, జులై-సెప్టెంబర్ మధ్య ఎన్‌టీపీసీ గ్రూప్ స్థూల విద్యుత్ ఉత్పత్తి 67.67 బిలియన్ యూనిట్లు కాగా, గతేడాది ఇదే కాలంలో 61.64 బిలియన్ యూనిట్లుగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్‌టీపీసీ షేర్లు సోమవారం 1.88 శాతం పెరిగి రూ. 89.25 వద్ద ట్రేడయ్యాయి.