మూడు అనుబంధ సంస్థలను ఐపీఓకు తీసుకురానున్న ఎన్‌టీపీసీ

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే బీమా రంగ ప్రభుత్వం దిగ్గజం ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లలో ఐపీఓ కోసం సిద్ధమవుతోంది. తాజాగా, ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్ దిగ్గజం ఎన్‌టీపీసీ కూడా తన మూడు అనుబంధ సంస్థలను లిస్టింగ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. దాదాపు రూ. 15,000 కోట్ల నిధుల కోసం ప్రణాళికను రూపొందించినట్టు సంస్థ వెల్లడించింది. నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఈఈపీసీఓ), ఎన్‌టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్‌లను లిస్టింగ్‌లో చేర్చింది. వీటి తర్వాత ఎన్‌టీపీసీ […]

Update: 2021-10-03 09:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే బీమా రంగ ప్రభుత్వం దిగ్గజం ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లలో ఐపీఓ కోసం సిద్ధమవుతోంది. తాజాగా, ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్ దిగ్గజం ఎన్‌టీపీసీ కూడా తన మూడు అనుబంధ సంస్థలను లిస్టింగ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. దాదాపు రూ. 15,000 కోట్ల నిధుల కోసం ప్రణాళికను రూపొందించినట్టు సంస్థ వెల్లడించింది. నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఈఈపీసీఓ), ఎన్‌టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్‌లను లిస్టింగ్‌లో చేర్చింది. వీటి తర్వాత ఎన్‌టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ లిస్టింగ్ కానుంది. ఎన్‌టీపీసీ సంస్థ దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థగా ఉంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న అవకాశాలను అందుకోవాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఇప్పటికే ఈ రంగంలో రిలయన్స్, అదానీ గ్రూప్, టాటా సంస్థలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పోటీ ఇచ్చేందుకు ఎన్‌టీపీసీ తన మూడు యూనిట్ల లిస్టింగ్ ద్వారా రూ. 15 వేల కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమవుతోంది. ఈ నిధుల ద్వారా మరింత వేగంగా విస్తరించాలని భావిస్తోంది. 2032 నాటికి 60 గిగావట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News