ఫేస్‌బుక్ లవ్.. వాట్సప్ ఫీల్ షేరింగ్ @స్మార్ట్ వరల్డ్
స్మార్ట్ ప్రపంచంలో లవర్స్ టూ స్మార్ట్ గా తయారవుతున్నారు. మారుతున్న కాలనీకి అనుగుణంగా ఫీలింగ్స్ మార్చేసుకుంటున్నారు. ట్రెండ్ ను ఫాలో అవుతూ రోజుకో తీరుగా సరికొత్తగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇందుకోసం ఎక్స్పర్ మెంట్స్ చేస్తున్నారు. ఒక ప్రేమ జంటను మించి మరో లవ్ బర్డ్స్ వెరైటీని కోరుకుంటున్నారు. ఇదివరకు ప్రేమికులు ప్రేమలేఖల్లో తమ భావనలను వర్ణించుకుంటూ ఉండేవారు. కానీ నేడు ఈ ట్రెండ్ మారింది. సెల్ హల్ చల్ చేస్తుంది. ఫోను సంభాషణలు చేస్తూ బాయ్స్ అండ్ […]
స్మార్ట్ ప్రపంచంలో లవర్స్ టూ స్మార్ట్ గా తయారవుతున్నారు. మారుతున్న కాలనీకి అనుగుణంగా ఫీలింగ్స్ మార్చేసుకుంటున్నారు. ట్రెండ్ ను ఫాలో అవుతూ రోజుకో తీరుగా సరికొత్తగా ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇందుకోసం ఎక్స్పర్ మెంట్స్ చేస్తున్నారు. ఒక ప్రేమ జంటను మించి మరో లవ్ బర్డ్స్ వెరైటీని కోరుకుంటున్నారు. ఇదివరకు ప్రేమికులు ప్రేమలేఖల్లో తమ భావనలను వర్ణించుకుంటూ ఉండేవారు. కానీ నేడు ఈ ట్రెండ్ మారింది. సెల్ హల్ చల్ చేస్తుంది. ఫోను సంభాషణలు చేస్తూ బాయ్స్ అండ్ గాళ్స్ రాత్రిబవళ్లు తమతమ ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఫేస్ బుక్ లో ప్రేమించుకుంటూ.. వాట్సప్ లో ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నారు. లాంగ్ డ్రైవ్స్ కు వెళ్లడానికి, స్పెషల్ టూర్స్ అంటూ ప్రైవసీగా గడిపేందుకు వెంపర్లాడుతున్నారు. సినిమాలు చూసి ప్రభావితం అవుతున్నారో.. లేదా మారుతున్న కాలాన్ని ఫాలో అవుతున్నారో కానీ లవ్ ఇప్పుడు స్మార్ట్ లవ్ గా మారిపోయింది.
దిశ, శేరిలింగంపల్లి : ప్రేమ.. మాటల్లో చెప్పలేని భావం.., ఊహలకందని అనుభూతి. అనుభవిస్తేనే కానీ తెలియని ఓ అద్భుతం. ఆ ప్రేమ ఎప్పుడు పుడుతుంది.? ఎలా పుడుతుందో చెప్పలేం. కానీ ఇప్పుడు ఆ ప్రేమకున్న అర్థమే మారిపోయింది. స్మార్ట్ ప్రపంచం, బిజీ లైఫ్ లో ప్రేమ సైతం కొత్తపుంతలు తొక్కుతున్నది. అయితే ఎంత మారినా లవర్స్ డే రోజున (ఫిబ్రవరి 14ను) స్పెషల్ గా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్రేమికులు ప్లాన్ చేసుకుంటారు. లవర్ కు సర్ప్రజైస్ గిఫ్ట్ ఇస్తుంటారు. మరో నాలుగు రోజులే లవర్స్ డే ఉండడంతో వేడుకలను గుర్తిండిపోయేలా చేసుకునేందుకు లవ్ బర్డ్స్ సిద్ధమయ్యాయి.
హైటెక్ ప్రేమ..
కాలంతో పాటే ప్రేమకున్న అర్థం మారుతోంది. ఇప్పుడు అంతా హైటెక్ ప్రేమలే. ఫేస్ బుక్ లో చూసి వాట్సాప్ లో ప్రపోజ్ చేయడం కామన్ గా మారింది. గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకోడం.. చాటింగ్ లతో ఊసులాడుకోవడం, ఎక్కడో ఒకచోట కలవడం, కొంతకాలం ఎవరికీ తెలియకుండా చెట్టాపట్టాలేసుకుని తిరగడం షరామామూలు అయిపోయింది. పబ్ లు, పార్క్ లు చుట్టేసి జాలీగా గడిపేస్తున్నారు.
ప్రతీ ఫీలింగ్.. షేరింగ్
ఇది వరకు ప్రేమ లేఖలతో, గ్రీటింగ్ కార్డుతో తమ ప్రేమను ఒకరికొకరు తెలుపుకునే వారు లవర్స్. ఇప్పుడా పరిస్థితులు లేవు అంతా మొబైల్ ప్రేమలే. రాత్రి లేదు పగలు లేదు. 24 గంటలు మొబైల్ లోనే చాటింగ్ లు, ఎమోజీలు, లవ్ కొటేషన్స్, మనసులో ఏమనుకుంటున్నారో అన్ని ఫీలింగ్స్ ను చాటింగ్ ల్లోనే ఊసులాడుకుంటున్నారు. గంటల తరబడి మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. ప్రతీ ఫీలింగ్ ను మొబైల్స్ లోనే షేర్ చేసుకుంటున్నారు. యూత్ ఇప్పుడు ఆన్ లైన్ ప్రేమల్లోనే మునిగి తేలుతున్నారు. ఇది వరకు ప్రేమికులు ఒకరిని ఒకరు కలవాలంటేనే అదో గగనం అయ్యేది. కానీ ఇప్పుడు చూడాలి అనిపిస్తుంది అంటే చాలు క్షణాల్లో వీడియో కాల్ చేసుకుంటూ మాట్లాడేసుకుంటున్నారు.
అన్నిచోట్లు లవర్స్ కు అడ్డాలే..
నగరంలో ఇప్పుడు బోలెడన్నీ లవర్స్ స్పాట్స్ ఉన్నాయి. పార్క్ లో కలవాలి, థియేటర్స్ లో మీటవ్వాలి అనే రూల్స్ ఏం లేవు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడైనా కలుసుకుంటున్నారు. వీధి వీధికి హాస్టల్స్, గల్లీకో రెస్టారెంట్, పార్కులు, మాల్స్, కాఫీ షాప్స్ ఇలా ఎవరికి అనుకూలమైన ప్లేస్ లో వారు మీటవుతున్నారు. ఎంత స్పీడ్ గా దగ్గర అవుతున్నారో అంతే స్పీడ్ గా బ్రేకప్ చెప్పేస్తున్నారు. ఫీలింగ్స్ కు ప్రియార్టీ ఇవ్వకుండానే ఎవరి దారిన వారు విడిపోతున్నారు. అదే టైమ్ లో గతంలో క్లోజ్ గా ఉన్న సందర్భాల్లో దిగిన సెల్ఫీలు, పోటోస్ ఇంటర్నెట్ లో పెట్టి బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా చేయడం వల్ల పరువు పోవడమే గాక ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు ఇప్పుడు ఫాస్ట్ లవ్.. ఫాస్ట్ బ్రేకప్ లా మారింది.
లవర్స్ డేకు స్పెషల్ పార్టీస్..
కొవిడ్ వల్ల ఏడాదిగా హైదరాబాద్ లో ఏ సెలబ్రేషన్స్ లేకుండా పోయాయి. మొన్నటికి మొన్న న్యూ ఇయర్ ఈవెంట్స్ సైతం ఏర్పాటు చేయలేదు. కానీ లవర్స్ డే సందర్భంగా మాత్రం పలు ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. అలాగే లవర్స్ కోసం మార్కెట్ లో లవ్ గిఫ్ట్, టెడ్డీబేర్స్, కలర్ ఫుల్ రోజెస్, లవ్ సింబల్స్, చాక్లెట్స్, కేక్స్ ఇలా అనేక రకాల గిఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి.