ఏడేళ్ల కనిష్ఠానికి ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు: సియామ్!

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత కారణంగా భారత్‌లో గత నెల ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 18.60 శాతం క్షీణించాయని పరిశ్రమల సంఘం సియామ్ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్‌లో మొత్తం 2,15,626 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడుపోయాయని, గతేడాది ఇదే నెలలో 2,64,898 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయని సియామ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. సమీక్షించిన నెలలో మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 16,00,379 యూనిట్ల నుంచి 34 […]

Update: 2021-12-10 05:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత కారణంగా భారత్‌లో గత నెల ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు 18.60 శాతం క్షీణించాయని పరిశ్రమల సంఘం సియామ్ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్‌లో మొత్తం 2,15,626 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడుపోయాయని, గతేడాది ఇదే నెలలో 2,64,898 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయని సియామ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. సమీక్షించిన నెలలో మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 16,00,379 యూనిట్ల నుంచి 34 శాతం తగ్గి 10,50,616 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే, 22,471 యూనిట్ల త్రీ-వీలర్లు అమ్ముడుపోయాయి.

ఇది గతేడాదితో పోలిస్తే 7 శాతం తక్కువ. ‘అంతర్జాతీయంగా ఆటో పరిశ్రమ సెమీ కండక్టర్ల కొరత వల్ల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పండుగ సీజన్‌లో కొంతమేర నష్టాలను భర్తీ చేసినప్పటికీ నవంబర్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఏడేళ్లలోనే అత్యల్పంగా నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాలు 11 ఏళ్లు, త్రీ-వీలర్ వాహనాలు 19 ఏళ్ల కనిష్టానికి క్షీణించాయని’ సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ వివరించారు. గత కొన్ని వారాలుగా కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల పరిశ్రమల్లో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, సరఫరా వ్యవస్థ మళ్లీ దెబ్బతింటుందేమో అనే సందేహంలో కంపెనీలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News