టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాకలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతినిధులకు రిటర్నింగ్ అధికారి నోటీసులు జారీ చేశారు. గురువారం ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల క్రితం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో దుబ్బాకకు ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో అక్కడ మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇదే క్రమంలో కొవిడ్ […]
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాకలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతినిధులకు రిటర్నింగ్ అధికారి నోటీసులు జారీ చేశారు. గురువారం ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల క్రితం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో దుబ్బాకకు ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో అక్కడ మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇదే క్రమంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో రిటర్నింగ్ అధికారి నోటీసులు జారీ చేశారు.