దయ్యాల కొంప కాదు.. ప్రభుత్వ బడి.. సీతక్క ట్వీట్ వైరల్

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సెప్టెంబర్ 1నుంచి పాఠశాలలను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే గత యేడాదిన్నరగా స్కూళ్లు మూతబడి ఉన్నాయి. ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉందో చూసేందుకు ఎమ్మెల్యే సీతక్క సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. అక్కడున్న పరిస్థితులపై ఆమె ట్విట్వర్‌లో పంచుకున్నారు. ‘‘మీరు చూస్తున్నది దయ్యాలు భూతాలు నివసించే ప్రాంతం కాదు. ఇది తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల. అమాయకమైన చిన్నారులను ప్రమాదంలో పడేసే పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ […]

Update: 2021-08-27 10:08 GMT

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సెప్టెంబర్ 1నుంచి పాఠశాలలను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే గత యేడాదిన్నరగా స్కూళ్లు మూతబడి ఉన్నాయి. ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉందో చూసేందుకు ఎమ్మెల్యే సీతక్క సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. అక్కడున్న పరిస్థితులపై ఆమె ట్విట్వర్‌లో పంచుకున్నారు. ‘‘మీరు చూస్తున్నది దయ్యాలు భూతాలు నివసించే ప్రాంతం కాదు. ఇది తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల. అమాయకమైన చిన్నారులను ప్రమాదంలో పడేసే పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ పాఠశాలలను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేసి ప్రతి బిడ్డ పాఠశాల నుంచి సురక్షితంగా, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’’అని ట్వీట్ చేస్తూ వీడియోని పోస్ట్ చేశారు.

Tags:    

Similar News