కొవిడ్ గర్భవతులకు నార్మల్ డెలివరీ…
దిశ, ముధోల్ : కరోనా సోకిందని తెలియగానే ఆమడ దూరంలో ఉంటున్న ఈ సమాజంలో కోవిడ్ సోకిన గర్భవతులకు బైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పూర్తి నార్మల్ డెలివరీ చేసి తల్లి,శిశువులను క్షేమంగా రక్షిస్తున్నారు. బైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఇప్పటివరకు ఎనిమిది మంది కోవిడ్ సోకిన గర్భవతులకు ఏడుగురికి నార్మల్ డెలివరీ, ఒకరికి సిజేరియన్ ద్వారా ప్రసవాలు చేశారు. ఈ నెల 7న కుబీర్ గ్రామానికి చెందిన సుజాత పురిటినొప్పులతో బాధపడుతుంది. అయితే ఆ గర్భవతి […]
దిశ, ముధోల్ : కరోనా సోకిందని తెలియగానే ఆమడ దూరంలో ఉంటున్న ఈ సమాజంలో కోవిడ్ సోకిన గర్భవతులకు బైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పూర్తి నార్మల్ డెలివరీ చేసి తల్లి,శిశువులను క్షేమంగా రక్షిస్తున్నారు. బైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఇప్పటివరకు ఎనిమిది మంది కోవిడ్ సోకిన గర్భవతులకు ఏడుగురికి నార్మల్ డెలివరీ, ఒకరికి సిజేరియన్ ద్వారా ప్రసవాలు చేశారు. ఈ నెల 7న కుబీర్ గ్రామానికి చెందిన సుజాత పురిటినొప్పులతో బాధపడుతుంది. అయితే ఆ గర్భవతి బాధను చూసి ముందుకొచ్చిన డా.వనిత ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను రక్షించారు. మొదట కోవిడ్ బాలింతలకు ప్రసవం చేసిన ఘనత భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికే దక్కుతుందని, వీరికి సేవలు చేయడం మరువలేనివి అనుభూతినిచ్చిందని డా.వనిత అన్నారు. ఈ మాదిరిగానే కొవిడ్ సోకిన మరో 7గురు గర్భవతులకు నార్మల్ డెలివరీ చేసినట్లు ఆమె తెలిపారు.