మత్స్యకారులకు బీమా కవరేజ్.. ఎలా మరణించినా సరే..!
దిశప్రతినిధి, ఆదిలాబాద్ : మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం తీసుకున్నవారందరికీ ప్రమాద బీమా పథకం వర్తింప జేయనున్నట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి మత్స్యకారులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తదని స్పష్టం చేశారు. మరణించిన మత్స్యకార కుటుంబాలకు శనివారం నిర్మల్ క్యాంపు కార్యాలయంలో ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. టెంబుర్ని గ్రామానికి చెందిన గుమ్ముల నరేష్, లక్ష్మణ చందా మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన పుట్టి రాజవ్వ, నిర్మల్ మండలం కొండాపూర్ […]
దిశప్రతినిధి, ఆదిలాబాద్ : మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం తీసుకున్నవారందరికీ ప్రమాద బీమా పథకం వర్తింప జేయనున్నట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి మత్స్యకారులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తదని స్పష్టం చేశారు. మరణించిన మత్స్యకార కుటుంబాలకు శనివారం నిర్మల్ క్యాంపు కార్యాలయంలో ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. టెంబుర్ని గ్రామానికి చెందిన గుమ్ముల నరేష్, లక్ష్మణ చందా మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన పుట్టి రాజవ్వ, నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎల్లుళ్ళ నర్సవ్వ కుటుంబాలకు తలా రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే మత్స్యకారుల కోసం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేయడంతో పాటు సబ్సిడీలో మోటార్ సైకిళ్లు, ఆటోలు, మొబైల్ ఫిష్ ఔట్‌లెట్స్ అందిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ రాం కిషన్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సుభాష్ రావు, జడ్పీటీసీ జీవన్ రెడ్డి, గంగపుత్ర సభ్యులు పోశెట్టి, కండల భోజన్న, గోనుగొప్పల నర్సయ్య పాల్గొన్నారు.