ఎమ్మెల్యే సీతక్కకు నాన్ బెయిలబుల్ వారెంట్
దిశ, క్రైమ్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నెల 9లోగా హాజరు కావాలని వారెంట్ జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ ములుగు పోలీసులను కోర్టు ఆదేశించింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్‌తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కంచర్ల భూపాల్ రెడ్డి, పి.చంద్రశేఖర్, టీడీపీ ఎమ్మెల్యే […]
దిశ, క్రైమ్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నెల 9లోగా హాజరు కావాలని వారెంట్ జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ ములుగు పోలీసులను కోర్టు ఆదేశించింది.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్‌తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కంచర్ల భూపాల్ రెడ్డి, పి.చంద్రశేఖర్, టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు, చిరుమర్తి లింగయ్యలు శుక్రవారం కోర్టుకు హాజరు కాగా, మచ్చా నాగేశ్వరరావుపై కోర్టు మూడు కేసులు కొట్టివేసింది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డికి సమన్లు పంపింది. హెరిటేజ్ దాఖలు చేసిన కేసులో ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులు హాజరయ్యారు.