ముగిసిన నామినేషన్ల పర్వం.. పోటీలో లేని బీజేపీ.. కారణం ఏంటి.?
దిశ, వెబ్‌డెస్క్ : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. మొత్తం 12 స్థానాలకు 92 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్పార్టీ నాలుగు స్థానాల నుంచి బరిలోకి దిగగా.. బీజేపీ దూరంగా ఉండటం గమనార్హం. 75 స్థానాల్లో స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్లో కల్వకుంట్ల కవిత ఒక్కరే నామినేషన్వేస్తారని అందరూ భావించినా చివరి క్షణంలో ఎంపీటీసీ సభ్యుడు కోటగిరి శ్రీనివాస్ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. తనను ప్రతిపాదించిన, బలపర్చిన వారి సంతకాలను శ్రీనివాస్ ఫోర్జరీ […]
దిశ, వెబ్‌డెస్క్ : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. మొత్తం 12 స్థానాలకు 92 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్పార్టీ నాలుగు స్థానాల నుంచి బరిలోకి దిగగా.. బీజేపీ దూరంగా ఉండటం గమనార్హం. 75 స్థానాల్లో స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్లో కల్వకుంట్ల కవిత ఒక్కరే నామినేషన్వేస్తారని అందరూ భావించినా చివరి క్షణంలో ఎంపీటీసీ సభ్యుడు కోటగిరి శ్రీనివాస్ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. తనను ప్రతిపాదించిన, బలపర్చిన వారి సంతకాలను శ్రీనివాస్ ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. స్క్రూటినీ సమయంలో అధికారులు తీసుకునే నిర్ణయం ఇక్కడ కీలకంగా మారనుంది.
జిల్లా స్థానాలు నామినేషన్లు
ఆదిలాబాద్ 1 23
వరంగల్ 1 14
నల్లగొండ 1 12
మెదక్ 1 4
నిజామాబాద్ 1 2
ఖమ్మం 1 3
కరీంనగర్ 2 21
మ.నగర్ 2 10
రంగారెడ్డి 2 3