కొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్న నోకియా!
దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో ఒకప్పుడు మొబైల్‌ఫోన్ మార్కెట్‌ను ఏలిన నోకియా ఇటీవల వ్యాపార విస్తరణలో దూకుడు పెంచింది. ఇటీవల దేశీయ మార్కెట్లోకి టీవీలను, ఎయిర్ కండీషనర్లు, ల్యాప్‌టాప్‌లను ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి తీసుకొస్తున్నట్టు ప్రకటించిన తర్వాత తాజాగా మరిన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తీసుకురానున్నట్టు వెల్లడించింది. రానున్న రోజుల్లో దేశీయ వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాక్యూమ్ క్లీనర్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషర్లను తీసుకురానుంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నోకియా వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే […]
దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో ఒకప్పుడు మొబైల్‌ఫోన్ మార్కెట్‌ను ఏలిన నోకియా ఇటీవల వ్యాపార విస్తరణలో దూకుడు పెంచింది. ఇటీవల దేశీయ మార్కెట్లోకి టీవీలను, ఎయిర్ కండీషనర్లు, ల్యాప్‌టాప్‌లను ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి తీసుకొస్తున్నట్టు ప్రకటించిన తర్వాత తాజాగా మరిన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తీసుకురానున్నట్టు వెల్లడించింది. రానున్న రోజుల్లో దేశీయ వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాక్యూమ్ క్లీనర్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషర్లను తీసుకురానుంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నోకియా వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది.
ఇందులో భాగంగానే అంతర్జాతీయంగా లైసెన్సులను పొంది రీబ్రాండింగ్ చేస్తున్నట్టు నోకియా బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ విపుల్ మెహ్రోత్రా స్పష్టం చేశారు. నోకియా బ్రాండ్‌కు తిరిగి పూర్వస్థాయికి తీసుకొచ్చేందుకే ఈ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తీసుకొస్తున్నామని, వీటి ద్వారా దేశీయ కస్టమర్లను ఆకట్టుకోగలమనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు. అదేవిధంగా, భారత్‌లో ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ఇరు సంస్థకు ఎంతో మేలు చేస్తుందన్నారు. పండుగ సీజన్‌లో నోకియా స్మార్ట్ టీవీలు ఫ్లిప్‌కార్ట్ వేదికగా అత్యధికంగా అమ్ముడయ్యాయని, దేశీయ టాప్-5 టీవీలలో నోకియా కూడా ఉందన్నారు. ఈ ఏడాది కొవిడ్-19 వల్ల వాక్యూమ్ క్లీనర్ వంటి ఉపకరణాలను తీసుకురావడంలో కొంత ఆలస్యమైనప్పటికీ మరిన్ని కస్టమర్లకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు విపుల్ మెగ్రోత్సా వెల్లడించారు.