టెక్ పరిష్కారాలకు వీఐఎల్‌తో నోకియా భాగస్వామ్యం
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా నోకియా సంస్థ వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు స్థిరమైన వైర్‌లెస్, ప్రైవేట్ వైర్స్‌లెస్ టెక్నాలజీ పరిష్కారాలను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. దేశీయంగా వివిధ సంస్థలు తమ డిజిటల్ విధానాన్ని ప్రారంభించే సాయంలో వొడాఫోన్ ఐడియా నోకియాతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. సంస్థలు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు అత్యుత్తమమైన ఐటీ, టెలికాం […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా నోకియా సంస్థ వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు స్థిరమైన వైర్‌లెస్, ప్రైవేట్ వైర్స్‌లెస్ టెక్నాలజీ పరిష్కారాలను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. దేశీయంగా వివిధ సంస్థలు తమ డిజిటల్ విధానాన్ని ప్రారంభించే సాయంలో వొడాఫోన్ ఐడియా నోకియాతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. సంస్థలు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు అత్యుత్తమమైన ఐటీ, టెలికాం మౌలిక సదుపాయాలను కల్పిస్తామని వొడాఫోన్ ఐడియా తెలిపింది.
‘తమ సంస్థ వినియోగదారులకు నూతన సేవలను అందించేందుకు ఇరు సంస్థల బలాన్ని వినియోగిస్తుంది. తద్వారా సంస్థలతో సహకారానికి ఎక్కువ అవకాశముంటుందని, డిజిటల్ విధానంలోకి మారేందుకు తమ భాగస్వామ్యం ఎంతో సహాయపడుతుందని’ వీఐఎల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ చెప్పారు. తమ భాగస్వామ్యం ద్వారా రెండు సంస్థలు కలిసి వ్యాపారా సంస్థలకు ఆటోమేషన్, ఇంటర్నెట్ విస్తరణ, క్లౌడ్ సేవలను ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ‘వీఐఎల్‌తో భాగస్వామయం ద్వారా సురక్షితమైన పద్దతిలో సంస్థల డిజిటల్ సామర్థ్యాన్ని పెంచేందుకు వీలవుతుంది. ఈ కార్యక్రమ మొదటి భాగస్వామిగా భారత్‌లోని వొడాఫోన్ ఐడియా రావడం గర్వంగా ఉంది’ అని నోకియా కస్టమర్ టీమ్ హెడ్ నితిన్ దహియా చెప్పారు.