‘ప్లాస్మా’తో ప్రయోజనం లేదు : ICMR
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో వైద్యులు ప్లాస్మా థెరపీని ఉపయోగించారు. దీనివలన కరోనా బారిన పడిన వారిని త్వరగా క్యూర్ చేయవచ్చని చెప్పారు. కానీ, ప్లాస్మా థెరపీతో కరోనా మరణాల రేటులో తగ్గుదల, వ్యాధి తీవ్రతను అదుపు చేయడంలో ఈ థెరపీ వలన ఎలాంటి ప్రయోజనం లేదని ICMR ప్రకటించింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 29 ప్రభుత్వ, 10 ప్రైవేటు ఆస్పత్రుల్లో అధ్యయనాలు జరిపింది. 14 రాష్ట్రాల్లోని 25 నగరాల్లో 1210 […]
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో వైద్యులు ప్లాస్మా థెరపీని ఉపయోగించారు. దీనివలన కరోనా బారిన పడిన వారిని త్వరగా క్యూర్ చేయవచ్చని చెప్పారు. కానీ, ప్లాస్మా థెరపీతో కరోనా మరణాల రేటులో తగ్గుదల, వ్యాధి తీవ్రతను అదుపు చేయడంలో ఈ థెరపీ వలన ఎలాంటి ప్రయోజనం లేదని ICMR ప్రకటించింది.
ఈ మేరకు దేశ వ్యాప్తంగా 29 ప్రభుత్వ, 10 ప్రైవేటు ఆస్పత్రుల్లో అధ్యయనాలు జరిపింది. 14 రాష్ట్రాల్లోని 25 నగరాల్లో 1210 మంది కరోనా బాధితులపై ఏప్రిల్ 22 నుంచి జూలై 14వరకు పరిశీలించి రిపోర్టు ప్రిపేర్ చేసింది. ప్లాస్మా థెరపీపై చైనా, నెదర్లాండ్ దేశాలు అధ్యయనాలు చేయగా అవి కూడా మధ్యలోనే ఆగిపోయాయని ICMR వెల్లడించింది.
Read Also..