‘క్రికెట్ ఆడాలన్న ఒత్తిడేమి లేదు’

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ఆడమని తమపై ఇంగ్లాడ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని.. కానీ రాబోయే సిరీస్‌లకు అందుబాటులో ఉంటారో లేదా అని మాత్రం అడుగుతోందని ఇంగ్లాండ్ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మాన్ జోస్ బట్లర్ అన్నాడు. కరోనా నేపథ్యంలో ఆగిపోయిన క్రికెట్‌ సీజన్‌ను జులై నుంచి ప్రారంభించాలని ఈసీబీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇంగ్లాండ్ ప్రభుత్వం కూడా ఆటగాళ్లకు మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో క్రికెటర్లు ఆట ఆడాలో వద్దో నిర్ణయించుకునే హక్కు […]

Update: 2020-05-14 05:43 GMT

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ఆడమని తమపై ఇంగ్లాడ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని.. కానీ రాబోయే సిరీస్‌లకు అందుబాటులో ఉంటారో లేదా అని మాత్రం అడుగుతోందని ఇంగ్లాండ్ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మాన్ జోస్ బట్లర్ అన్నాడు. కరోనా నేపథ్యంలో ఆగిపోయిన క్రికెట్‌ సీజన్‌ను జులై నుంచి ప్రారంభించాలని ఈసీబీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇంగ్లాండ్ ప్రభుత్వం కూడా ఆటగాళ్లకు మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో క్రికెటర్లు ఆట ఆడాలో వద్దో నిర్ణయించుకునే హక్కు ఉందని ఈసీబీ చెప్పింది. కరోనా ఒత్తిడి కారణంగా ఆటకు దూరంగా ఉందామని భావించే క్రికెటర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కూడా హామీ ఇస్తోంది. జులైలో వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు రాబోతోంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండే క్రికెటర్లు తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ఇంగ్లాండ్ మెన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్, మెడికల్ ఆఫిసర్స్ గుర్జ్, నిక్ పియర్స్‌ కోరారు. వీరు ఆటగాళ్లతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ వారిని మానసికంగా సిద్దం చేస్తున్నారు. ఆటకంటే ఆటగాళ్ల ఆరోగ్యాలే తమ తొలి ప్రాధాన్యత అని వారు చెప్పినట్లు బట్లర్ తెలియజేశాడు.

Tags:    

Similar News