మానవత్వానికి కరోనా భయం

దిశ, కరీంనగర్: ఎవ్వరేమన్న గానియ్యు.. నాకవసరంలేదు.. నేను మాత్రం మంచిగుండాలన్న ధోరణి.. మాకు కూడా హృదయముంది..కానీ, కాలు కదపలేము తెలుసు కదా అంటూ చేతులెత్తేస్తున్నారూ. అదేంటో మీరే ప్రత్యేక కథనంలో చూడండి…. బతికి బట్ట కడితే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనే స్వార్థంతో రోజులు గడిపే గత్యంతరం లేని పరిస్థితిని కలిపించింది మహమ్మారి కరోనా. ఉగాది పండగ రోజు వెంకటేశ్ అనే వ్యక్తి కరీంనగర్ లోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలో గుండెపోటుతో పడిపోయి గిలాగిలా […]

Update: 2020-03-28 00:37 GMT

దిశ, కరీంనగర్: ఎవ్వరేమన్న గానియ్యు.. నాకవసరంలేదు.. నేను మాత్రం మంచిగుండాలన్న ధోరణి.. మాకు కూడా హృదయముంది..కానీ, కాలు కదపలేము తెలుసు కదా అంటూ చేతులెత్తేస్తున్నారూ. అదేంటో మీరే ప్రత్యేక కథనంలో చూడండి….

బతికి బట్ట కడితే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనే స్వార్థంతో రోజులు గడిపే గత్యంతరం లేని పరిస్థితిని కలిపించింది మహమ్మారి కరోనా. ఉగాది పండగ రోజు వెంకటేశ్ అనే వ్యక్తి కరీంనగర్ లోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలో గుండెపోటుతో పడిపోయి గిలాగిలా కొట్టుకున్నా జనమెవ్వరు కూడా ఆయన దగ్గరికి వెళ్లకపోవడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లాక్ డౌన్ తో కూరగాయలు కొనుగోలు చేస్తున్న జనం కశ్మీర్ గడ్డ రైతు బజార్ లోనే ఉన్నా అతన్ని పట్టించుకున్నవారే లేరు. దూరంగా ఉండి అయ్యో పాపం అంటూ చూశారే తప్ప ఆయన దగ్గరికి మాత్రం ఎవరూ వెళ్లలేదు. చివరకు చనిపోయిన వెంకటేష్ ను అంబులెన్స్ లో తరలించాల్సి వచ్చింది. ఇండోనేషియన్స్ సంచరించిన ప్రాంతమైన ముకరంపురాతో పాటు కశ్మీర్ గడ్డను అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించడంతో వెంకటేశ్ గుండెపోటుతో కిందపడి కొట్టుకుంటున్నా పట్టించుకోలేదు. కరోనా వ్యాధి భయం జనాన్ని వెంటాడుతుండడం వల్లే వెంకటేశ్ దగ్గరికి వెళ్లలేక పోయారు. కరోనా భయం వెంటాడకపోతే కిందపడ్డ వెంకటేశ్ ను కాపాడేందుకు స్పందించి ఆసుపత్రికి పంపించే వారు. దీనితో ఆయనకు సకాలంలో వైద్యం అంది ఆయన జీవించే అవకాశాలు కూడా ఉండేవి. ప్రతి ఒక్కరి మనసు కదిలించింది: ఇక పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో చోటు చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరి మనసును కదిలించింది. నందిమేడారానికి చెందిన కొసరి రాజవ్వ అనారోగ్యంతో మృతిచెందింది. భర్త రెండు నెలల క్రితమే చనిపోగా.. రాజవ్వకు పిల్లలు కూడా లేరు. గ్రామస్థులు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న సమీప బంధువులకు సమాచారం చేరవేశారు. కానీ, కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైపోవడంతో రాజవ్వ బంధువులెవ్వరూ కూడా నందిమేడారం రాలేకపోయారు. బంధువులు అందరూ ఉన్నా అనాథ శవంలా ఆమె అంత్యక్రియలు జరిపించాల్సి వచ్చింది. గ్రామ ప్రజా ప్రతినిధులు పారిశుద్ధ్యానికి ఉపయోగించే రిక్షాలో రాజవ్వ మృతదేహాన్ని తరలించి అంత్యక్రియల తంతు నిర్వహించారు. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో అన్ని గ్రామాలు స్వీయ నిర్భందంలోకి వెళ్లాయి. కొన్ని గ్రామాల్లో అయితే గ్రామం దాటి వెళ్లితే మళ్లీ ఊర్లోకి అడుగు పెట్టవద్దన్న నిబంధనలనూ పెట్టకున్నాయి. ఇలా కరోనా భయం కారణంగా గ్రామంలో చేసుకున్న తీర్మాణాలు రాజవ్వను అనాథను చేశాయి. మహమ్మారి కరోనా మానవ సంబంధాలను కూడా తెగ తెంపులు చేసే విధంగా జనాన్ని కలవరపెడుతుందనడానికి ఈ రెండు ఘటనలే ప్రత్యక్ష్య ఉదాహారణ.

Tags: corona, karimnagar, heart attack

Tags:    

Similar News