ప్లీనరీలో ఆ ఎమ్మెల్యే కొడుక్కి నో ఎంట్రీ.. ప్రెస్‌ పేరుతో అడ్డదారి..!

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీ 20వ ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గానికి సుమారు 25 మందికి మాత్రమే ఆహ్వానం పలికారు. ఈ ఆహ్వానం అందుకున్న వారిలో జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, స్థానిక ఎమ్మెల్యే వెంట తిరిగే కొద్ది మందికి ఐడీకార్డులు ఇచ్చినట్లు ఆ పార్టీకి చెందిన నేతలే బహిర్గతం చేస్తున్నారు. ఎన్నో యేండ్లుగా పార్టీ ప్రారంభం నుంచి పనిచేసే నేతలకు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి ఆహ్వానం లేకపోవడంతో కొంత ఆవేదన వ్యక్తం […]

Update: 2021-10-25 07:05 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీ 20వ ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గానికి సుమారు 25 మందికి మాత్రమే ఆహ్వానం పలికారు. ఈ ఆహ్వానం అందుకున్న వారిలో జడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, స్థానిక ఎమ్మెల్యే వెంట తిరిగే కొద్ది మందికి ఐడీకార్డులు ఇచ్చినట్లు ఆ పార్టీకి చెందిన నేతలే బహిర్గతం చేస్తున్నారు. ఎన్నో యేండ్లుగా పార్టీ ప్రారంభం నుంచి పనిచేసే నేతలకు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి ఆహ్వానం లేకపోవడంతో కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల అనుచరులుగా చెప్పుకునే వారికి అవకాశం ఉన్న విధంగా ఐడీ కార్డులు జారీ చేసి తీసుకెళ్లారు. టీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు హోదాతో.. వాలంటీర్లుగా, క్యాటరింగ్, ప్రెస్ లాంటి తదితర ఐడీ కార్డులను టీఆర్ఎస్ పార్టీ జారీ చేసింది. అయితే ఐడీ కార్డు లేని వ్యక్తులను ప్లీనరీ సమావేశ ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశ ప్రాంగణంలోకి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అవకాశం లేకపోడంతో.. ప్రెస్ కార్డ్‌ను ఉపయోగించి వెళ్లినట్లు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News