ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడని కరోనా
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. అయితే.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా అధికారికంగా నమోదు కాలేదు. ఈ స్థాయిలో కరోనా ప్రభావం నుంచి తప్పించుకోవడానికి గల కారణాలను కవరత్తి అదనపు కలెక్టర్ కాసిం మాట్లాడుతూ.. ‘లక్షద్వీప్‌లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదవకపోవడం ఎంతో సంతోషాన్నిస్తుంది. దీనికోసం మేము కొన్ని […]
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. అయితే.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా అధికారికంగా నమోదు కాలేదు. ఈ స్థాయిలో కరోనా ప్రభావం నుంచి తప్పించుకోవడానికి గల కారణాలను కవరత్తి అదనపు కలెక్టర్ కాసిం మాట్లాడుతూ.. ‘లక్షద్వీప్‌లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదవకపోవడం ఎంతో సంతోషాన్నిస్తుంది. దీనికోసం మేము కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని తెలిపారు.
కోవిద్-19 కట్టడికోసం లక్షద్వీప్‌కు చెందిన స్థానికులను మాత్రమే ఇతర ప్రాంతాలనుంచి వచ్చేందుకు అనుమతిస్తున్నాం. అది కూడా కరోనా నెగెటివ్‌గా తేలిన వారిని మాత్రమే రానిస్తున్నాం. అలా వచ్చిన వారిని కూడా 14 రోజుల పాటు పూర్తిస్థాయి పర్యవేక్షణలో ఉంచుతున్నాం. ఇప్పటికే పర్యాటకులను కేంద్రం నిషేధించింది. ఈ నేపథ్యంలో మేం తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయ’ని చెప్పారు. అంతేకాకుండా జనాభా కూడా తక్కువగా ఉండడం వల్ల కరోనా నుంచి తప్పించుకోగలిగామని కాసిం పేర్కొన్నారు.