Pahalgam: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో ఒకరు మృతి

జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిలో ఒకరు చనిపోయారు. జమ్ముకశ్మీర్ లో పర్యటకులపై ఉగ్రదాడి (Terror attack) జరిగింది. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా.. మరో ఏడుగురికి గాయలయ్యాయి.

Update: 2025-04-22 13:33 GMT
Pahalgam: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో ఒకరు మృతి
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిలో ఒకరు చనిపోయారు. జమ్ముకశ్మీర్ లో పర్యటకులపై ఉగ్రదాడి (Terror attack) జరిగింది. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా.. మరో ఏడుగురికి గాయలయ్యాయి. మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్‌ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవడానికి వీలుంది. అయితే, అక్కడ ట్రెక్కింగ్ ట్రిప్ కోసం వెళ్లిన పర్యాటకులపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపారు. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ దాడి జరిగిందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. పహల్గామ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పహల్గామ్‌లోని బైసరన్ లోయలో తుపాకీ కాల్పులు వినిపించాయని పోలీసులు తెలిపారు. బైసరన్ పచ్చిక బయళ్లలో గుర్రపు స్వారీ చేస్తున్న పర్యాటకులపై ఇద్దరుముగ్గురు ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. బాధితులను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఓ మహిళ తన భర్తను రక్షించమని అందులో ఏడుస్తున్నట్లు ఉంది.

జమ్ముకశ్మీర్ మాజీ సీఎం..

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. "పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాని పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి హింస ఆమోదయోగ్యం కాదు, దీన్ని ఖండించాలి. చారిత్రాత్మకంగా కశ్మీర్ పర్యాటకులను హృదయపూర్వకంగా స్వాగతించింది. కానీ, ఈ ఘటన ప్రశాంత వాతావరణాన్ని ఆందోళనకరంగా మార్చింది. నేరస్థులను న్యాయం చేయడానికి, సంభావ్య భద్రతా లోపాలను పరిశీలించడానికి సమగ్ర దర్యాప్తు అవసరం. సందర్శకుల భద్రతను నిర్ధారించడం చాలా ముఖ్యమైనది. భవిష్యత్తులో దాడులను నివారించడానికి చర్యలు తీసుకోవాలి. బాధితులు వారి కుటుంబాలకు అండగా ఉంటాం" అని మెహబూబా ముఫ్తీ సోషల్ మీడియా ఎక్స్ లో రాసుకొచ్చారు.

Tags:    

Similar News