కరోనా వేళ.. కళ తప్పిన రంజాన్
దిశ, హైదరాబాద్ : కరోనా రాకతో ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకునే పండుగల సందడి కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా నిర్బంధం కొనసాగుతుండగా కొందరు మినహా చాలా మంది బయటకు రావడంలేదు.లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో దుకాణాలు ఓపెన్ అవ్వగా, వాహనాలు కూడా ఇప్పుడిప్పుడే రోడ్ల పైకి వస్తున్నాయి. కానీ, కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రంజాన్ పర్వదినాన్ని హైదరాబాద్‌లో కుల,మతాలకతీతంగా ప్రతీ ఏడాది […]
దిశ, హైదరాబాద్ :
కరోనా రాకతో ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకునే పండుగల సందడి కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా నిర్బంధం కొనసాగుతుండగా కొందరు మినహా చాలా మంది బయటకు రావడంలేదు.లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో దుకాణాలు ఓపెన్ అవ్వగా, వాహనాలు కూడా ఇప్పుడిప్పుడే రోడ్ల పైకి వస్తున్నాయి. కానీ, కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రంజాన్ పర్వదినాన్ని హైదరాబాద్‌లో కుల,మతాలకతీతంగా ప్రతీ ఏడాది ఘనంగా జరుపుకుంటారు.ఈ సారి లాక్ డౌన్‌లో రంజాన్ పండుగ రావడం, సిటీలో నిర్బంధం కొనసాగుతుండటంతో దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో పాతబస్తీతో పాటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే పలు ప్రాంతాలు బోసిపోయాయి.నార్మల్ డేస్‌లో రంజాన్ పండుగ వస్తే హిందువులు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకునేవారు. స్నేహితులు అయితే హలీం సెంటర్లు, బిర్యానీ సెంటర్ల వద్ద దావత్ చేసుకునే వారు. కానీ,2020 సంవత్సరంలో రంజాన్ పండుగ అత్యంత సాదాసీదాగా జరగనుంది. ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించడం, ముస్లిం మత పెద్దలు సైతం ప్రార్థనలు ఇంట్లోనే చేసుకోవాలని పిలుపునివ్వడంతో త్యోహార్ కళ తప్పింది. హలీం సెంటర్లు, దుకాణాలు బంద్ కావడంతో చాలా మందికి ఉపాధి కోల్పొయారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుందామన్న చాలా మంది పేద ముస్లిం కుటుంబాలు చేతిలో చిల్లిగవ్వ తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.అంతే కాకుండా ఎప్పుడు ప్రార్థనలు జరిగే మక్కా మసీదు, చార్మినార్, మీరాలం ఈద్గా, మాదన్నపేట ఈద్గా తదితర మందిరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.