‘రఘురామ’ను కొట్టినట్లు గాయాలేమీ లేవు : వైద్య బృందం నివేదిక
దిశ, వెబ్‌డెస్క్ : నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును కొట్టినట్టుగా గాయాలు ఏవీ లేవని, అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని హైకోర్టుకు వైద్య బృందం నివేదిక అందజేసింది. జీజీహెచ్ ఇచ్చిన నివేదికను డివిజన్ బెంచ్ హైకోర్టుకు చదివి వినిపించింది. రమేష్ ఆస్పత్రిలో పరీక్షలు చేసే విషయంలో సీఐడీ కోర్టు ఉత్వర్వులను పాటించాలని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న ఆదేశంపై ఏఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏఏజీ […]
దిశ, వెబ్‌డెస్క్ : నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజును కొట్టినట్టుగా గాయాలు ఏవీ లేవని, అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని హైకోర్టుకు వైద్య బృందం నివేదిక అందజేసింది. జీజీహెచ్ ఇచ్చిన నివేదికను డివిజన్ బెంచ్ హైకోర్టుకు చదివి వినిపించింది. రమేష్ ఆస్పత్రిలో పరీక్షలు చేసే విషయంలో సీఐడీ కోర్టు ఉత్వర్వులను పాటించాలని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న ఆదేశంపై ఏఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదించారు. రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్తే.. టీడీపీ ఆఫీస్‌కు తీసుకెళ్లినట్లే అని ఏఏజీ కోర్టుకు వివరించారు. రమేశ్ ఆస్పత్రి నిర్లక్ష్యంతో 10 మంది మృతి చెందిన విషయాన్ని గుర్తుచేశారు.ఈ అభ్యంతరాలతో మరో పిటిషన్ దాఖలు చేయాలని ఏఏజీకి హైకోర్టు సూచించింది. ఇదిలాఉండగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడనే కారణం చేత ఏపీ సీఐడీ పోలీసులు నర్సాపురం ఎంపీని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే.