గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు డిశ్చార్జ్ : కలెక్టర్ నారాయణ రెడ్డి

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ పాజిటివ్‌తో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు రోగులు పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు వారిని ఆదివారం డిశ్చార్జ్ చేశారు.ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లాలో 61 మంది ఈ వైరస్ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 2 రోజుల కిందట 30 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, తాజాగా […]

Update: 2020-04-26 08:00 GMT

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ పాజిటివ్‌తో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు రోగులు పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు వారిని ఆదివారం డిశ్చార్జ్ చేశారు.ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నిజామాబాద్

జిల్లాలో 61 మంది ఈ వైరస్ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 2 రోజుల కిందట 30 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, తాజాగా మరో నలుగురు రోగులు పూర్తి ఆరోగ్యవంతులుగా తమ ఇళ్లకు చేరుకున్నారు. వీరితో కలిపి 61 మందిలో మొత్తం 34 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు.

ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఇంటికి వచ్చే వారిని సాదరంగా ఆహ్వానించాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. కాగా, మరికొన్ని రోజులు మనమందరం ఈ లాక్‌డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, తద్వారా నిజామాబాద్ జిల్లా కరోనా ఫ్రీగా మారుతుందని ఆయన ప్రజలను కోరారు. అందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, మాస్కులతోనే బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News