ఈటల ఎంట్రీ.. బీజేపీ డైనమిక్ లీడర్ సైలెంట్!

దిశ ప్రతినిధి, కరీంనగర్: దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో దుమ్మురేపిన ఆ ఎంపీ ఇప్పుడు తన ఇలాఖాకే పరిమతం అయ్యారెందుకు?. ఈటల ఎపిసోడ్ ప్రారంభంలో మెరుపులు మెరిపించిన ఆయన ఇప్పుడు సైలెంట్ అయ్యారెందుకు?. పంచ్ డైలాగులతో పరేషాన్ చేసే ఎంపీ మైదానంలోకి దిగుతారా? లేదా? అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇందూరుకే పరిమితం.. తన పంచ్ డైలాగులతో తనదైన స్టైల్‌లో జనాన్ని ఆకట్టుకునే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రస్తుతం అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం […]

Update: 2021-06-23 21:14 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో దుమ్మురేపిన ఆ ఎంపీ ఇప్పుడు తన ఇలాఖాకే పరిమతం అయ్యారెందుకు?. ఈటల ఎపిసోడ్ ప్రారంభంలో మెరుపులు మెరిపించిన ఆయన ఇప్పుడు సైలెంట్ అయ్యారెందుకు?. పంచ్ డైలాగులతో పరేషాన్ చేసే ఎంపీ మైదానంలోకి దిగుతారా? లేదా? అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ.

ఇందూరుకే పరిమితం..

తన పంచ్ డైలాగులతో తనదైన స్టైల్‌లో జనాన్ని ఆకట్టుకునే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రస్తుతం అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాత్రం కేసీఆర్ జిల్లాల పర్యటనకు కారణం ఈటల ఎపిసోడే అంటూ కామెంట్ చేశారు. కానీ రాజేందర్ బీజేపీలో చేరిన తరువాత మాత్రం చాలా రోజులు మౌనంగానే ఉండిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసి కామెంట్స్ చేసే బీజేపీ నేతల్లో ఒకరైన ధర్మపురి అర్వింద్ సైలెంట్ కావడం బీజేపీ శ్రేణులకు అంతు చిక్కకుండా మారింది. దుబ్బాక బై పోల్స్ లాగానే హుజురాబాద్‌లో కూడా అరవింద్ దూకుడు ప్రదర్శిస్తారని ఆశించిన బేజేపీ కేడర్‌కు నిరుత్సాహం ఎదురయింది. దీంతో ఉప ఎన్నికల నాటికైనా అరవింద్ హుజురాబాద్ టూర్ చేస్తారా? లేదా అన్న సస్నెన్స్ కార్యకర్తల్లో మొదలైంది. యూత్‌లో కొంత క్రేజ్ ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఎంపీ అరవింద్ ఒకరు. ఆయన టూర్ చేస్తే లోకల్ లీడర్స్‌లో జోష్ నింపే అవకాశం ఉన్నప్పటికీ అంటీముట్టనట్టగా వ్యవహరిస్తుండడమే బీజేపీ కేడర్‌కు అంతుచిక్కకుండా తయారైంది.

Tags:    

Similar News