బాధ్యతలు స్వీకరించిన NZB IMA నూతన పాలకవర్గం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లాశాఖ 2021-22 సంవత్సరానికి గాను ఎన్నికైన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం రాత్రి నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.సంపత్ రావ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా జాతీయ వైద్యుల సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ ఏలేటి రవీంద్ర రెడ్డి, గౌరవ అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.సంపత్ […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లాశాఖ 2021-22 సంవత్సరానికి గాను ఎన్నికైన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం రాత్రి నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.సంపత్ రావ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా జాతీయ వైద్యుల సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ ఏలేటి రవీంద్ర రెడ్డి, గౌరవ అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.సంపత్ రావ్, నూతన అధ్యక్షులు డాక్టర్ బీఎన్ రావ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రమాణ స్వీకారం చేయించారు.
నూతన కార్యవర్గం: నిజామాబాద్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కే.సుభాష్, నూతన అధ్యక్షులు నీలి రాంచందర్, ప్రధాన కార్యదర్శి జలగం తిరుపతి రావ్, ఉపాధ్యక్షులు ఎస్ శివ ప్రసాద్, విశాల్ ఆకుల, ఫరీదా బేగం, సహాయ కార్యదర్శులుగా ఎండీ రషీద్ అలీ, వొక్కెర్ల కిరణ్ రావ్, కొండా సంతోష్ కుమార్, కోశాధికారి హరీష్ స్వామి, కార్యవర్గ సభ్యులు వి.రాజేష్, కప్పల రాజేష్, గోపాల్ సింగ్, రాజేంద్ర ప్రసాద్, అర్జున్ కుమార్, అంకం గణేశ్, విజయ్ భాస్కర్ రెడ్డి, వెంకన్న, చంద్రశేఖర్ రెడ్డి, పి.జగన్ కుమార్, స్మిత వదన, టి.శైలజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.కౌలయ్య, రాష్ట్ర కౌన్సిల్ ప్రతినిధులు జె.బాపు రెడ్డి, పీవీ రామకృష్ణన్, ఎం.వినోద్ కుమార్ గుప్తా, టి.జీవన్ రావు, ఇ.సంధ్యారాణి, సి.హరిప్రసాద్ రావు, కె.భూమారెడ్డి, ఎం.ఆర్ ద్వారకాదేవి, అజ్జా శ్రీనివాస్, విశాల్ అకుల, జాతీయ కౌన్సిల్ ప్రతినిధులు, ఎం.శ్రీహరి, బి.దామోదర్ రావు, వై.సాంబశివరావు, డీఎల్ఎన్. స్వామిలతో పాటు సుమారు 70 మంది వైద్యులు పాల్గొన్నారు.