డిగ్రీ పరీక్షల కోసం నిజాంసాగర్ గేట్లు మూసివేత

దిశ, పిట్లం: సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో వారం రోజులుగా పిట్లం మండలం కుర్తి గ్రామానికి వెళ్లే బ్రిడ్జి మునిగి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలో డిగ్రీ విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు ఉండటంతో అధికారులు స్పందించి ఉదయం సాగర్ గేట్లను కొన్నింటిని మూసివేసి విద్యార్థులను పరీక్షలకు పంపించారు. బ్రిడ్జి మునిగి వారం రోజులుగా గ్రామంలో, బయట చిక్కుకుపోయిన వారు ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ సాగర్ గేట్లు తెరవడానికి రెండు గంటల సమయం ఇవ్వడంతో నిత్యావసర […]

Update: 2021-10-01 06:57 GMT

దిశ, పిట్లం: సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో వారం రోజులుగా పిట్లం మండలం కుర్తి గ్రామానికి వెళ్లే బ్రిడ్జి మునిగి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలో డిగ్రీ విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు ఉండటంతో అధికారులు స్పందించి ఉదయం సాగర్ గేట్లను కొన్నింటిని మూసివేసి విద్యార్థులను పరీక్షలకు పంపించారు. బ్రిడ్జి మునిగి వారం రోజులుగా గ్రామంలో, బయట చిక్కుకుపోయిన వారు ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ సాగర్ గేట్లు తెరవడానికి రెండు గంటల సమయం ఇవ్వడంతో నిత్యావసర సరుకుల కోసం ఉరుకులు పరుగులతో పిట్లం వెళ్లారు.

Tags:    

Similar News