లిప్ కిస్ పై ఫేక్ న్యూస్… 'పాగల్' బ్యూటీ ఫైర్

దిశ, వెబ్ డెస్క్: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే కేవలం నాలుగు పాటలకు, హీరోలతో ముద్దులకు మాత్రమే పనికి వస్తుందనే భావన కొద్దికొద్దిగా పోతుంది. కథ డిమాండ్ చేస్తే తప్ప హీరోయిన్లు ముద్దు సీన్స్ కి అంగీకరించడం లేదు. అలా అని మరీ మడికట్టుకు కూర్చోవడం లేదు. కొన్నిసార్లు బోల్డ్ సీన్లలో, కిస్ సీన్లలో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు సినిమాలలో ముద్దు సీన్లకు నో చెప్తారు అనే టాక్ ఉంది. అందులో నివేతా పేతురాజ్ […]

Update: 2021-04-01 06:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే కేవలం నాలుగు పాటలకు, హీరోలతో ముద్దులకు మాత్రమే పనికి వస్తుందనే భావన కొద్దికొద్దిగా పోతుంది. కథ డిమాండ్ చేస్తే తప్ప హీరోయిన్లు ముద్దు సీన్స్ కి అంగీకరించడం లేదు. అలా అని మరీ మడికట్టుకు కూర్చోవడం లేదు. కొన్నిసార్లు బోల్డ్ సీన్లలో, కిస్ సీన్లలో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు సినిమాలలో ముద్దు సీన్లకు నో చెప్తారు అనే టాక్ ఉంది. అందులో నివేతా పేతురాజ్ ఒకరు. మొదటి నుండి బోల్డ్ సీన్లకు, కిస్ సీన్లకు దూరంగా ఉంటారని ఇండస్ట్రీలో ఒక టాక్. తాజాగా ఈ విషయమై అమ్మడి మీద ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం నివేతా ‘పాగల్’ చిత్రం లో నటిస్తుంది. విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ చిత్రంలో నివేతా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. అయితే రొమాంటిక్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ తో ఘాటు ముద్దు సన్నివేశాలు నివేతాకు లేవని.. అమ్మడు అలాంటి వాటికి ఒప్పుకోదని రూమర్స్ దుమారం లేపాయి. తాజగా ఈ పుకార్ల మీద ఈ భామ ఘాటుగానే స్పందించింది. “ముందుగా సినిమాలో కిస్ సీన్లు ఉన్నట్లు దర్శకుడు నాకు చెప్పలేదు… సినిమా స్టోరీ అందంగా ఉంది.. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి” అంటూ తెలిపింది. అంటే డైరెక్టర్ అడగలేదు కాబట్టి కిస్ సీన్స్ ఒప్పుకోలేదు.. ఒకవేళ అడిగి ఉంటే చేసేదానివా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఏది ఏమైనా నో కిస్ నియమాలు ఏమి లేవు.. నేను లిప్ లాక్స్ కి రెడీ అంటూ హింట్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Tags:    

Similar News