మాస్ ఫీట్: హీరోయిన్ కారు రేసింగ్.. వీడియో వైరల్
దిశ, సినిమా : బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అయింది. కారు రేసింగ్ అంటే పాషన్ ఉన్న నివేద.. ఫార్ములా రేస్ కారు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ లెవల్ కంప్లీట్ చేసింది. ‘మోమెంటమ్ – స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్’ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయగా.. నెట్టింట ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసిన అభిమానులు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. View this post on Instagram A post shared by […]
దిశ, సినిమా : బ్యూటిఫుల్ నివేదా పేతురాజ్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అయింది. కారు రేసింగ్ అంటే పాషన్ ఉన్న నివేద.. ఫార్ములా రేస్ కారు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ లెవల్ కంప్లీట్ చేసింది. ‘మోమెంటమ్ – స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్’ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయగా.. నెట్టింట ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసిన అభిమానులు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు పక్కింటి ఆంటి స్పోర్ట్స్ కారు కొనుగోలు చేయగా.. అప్పటి నుంచి కార్లు, కారు రేసింగ్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందని చెప్పింది నివేద. 2015లో ‘డాడ్జ్ చాలెంజర్’ స్పోర్ట్స్ కారు కొన్నానని, యూఏఈలో ఆ కారు కొనుగోలు చేసిన రెండో అమ్మాయి తనేనని తెలిపింది. అయితే ఫాస్ట్ రేసింగ్ పవర్ వి6 ఇంజిన్ కలిగి ఉన్న ఈ కారు అంటే డాడీకి ఇష్టం లేదని వివరించింది. దుబాయ్‌లో పలు మోటార్ షోస్‌లో వర్క్ చేసిన తనకు కార్ల పట్ల మరింత ఆసక్తి పెరిగిందని, చెన్నై వచ్చాక కూడా మోటార్ ట్రాక్స్ సందర్శించానని తెలిపింది. వారం రోజుల పాటు బీఎండబ్ల్యూ కారు టెస్ట్ డ్రైవింగ్ కోసం తనను అప్రోచ్ అయినప్పుడు కార్ల మీద తనకున్న లవ్ రీబూట్ అయిందన్న నివేద.. ఈ క్రమంలోనే కోయంబత్తూర్‌లోని ‘మొమెంటం – స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్’లో మూడునెలల ముందుగానే ఎన్‌రోల్ చేయించుకున్నానని తెలిపింది. ప్రతీ సెషన్‌లో ఎనిమిది మంది ఉంటారని, వారిలో తను ఒక్క అమ్మాయి మాత్రమేనన్న నివేద.. ట్రాక్స్‌కు అలవాటు పడ్డాక ల్యాప్ టైమింగ్‌లు వారితో సమానంగా ఉన్నాయని చెప్పింది.
మహిళల కోసం ఫార్ములా 1, ఫార్ములా 2 చాంపియన్‌షిప్‌లు లేవని.. త్వరలో వస్తాయనే నమ్మకంతో ఉన్నానని తెలిపింది నివేద. ఇప్పటికే చాలా చాంపియన్‌షిప్స్ కోసం తనను సంప్రదించారని, అయితే ట్రాక్ ప్రాక్టీస్ కోసం మరింత డెడికేషన్ అవసరమని తెలిపింది. అయితే ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యా కాబట్టి స్పాన్సర్స్‌ను పొందడం సులభమమేనని అభిప్రాయపడింది. ఈ కాస్ట్‌లీ స్పోర్ట్‌లో ప్రతీ రేస్‌కు దాదాపు రూ.15లక్షలు ఖర్చవుతుందని వివరించింది.