Tamannaah Bhatia: ఆ హీరోతో ఆ పని చేయాలని కోరికగా ఉంది.. తన మనసులోని మాట బయటపెడుతూ తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia ) ‘ఓదెల-2’ (Odela-2)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Update: 2025-04-15 08:15 GMT
Tamannaah Bhatia: ఆ హీరోతో ఆ పని చేయాలని కోరికగా ఉంది.. తన మనసులోని మాట బయటపెడుతూ తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia ) ‘ఓదెల-2’ (Odela-2)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అశోక్ తేజ(Ashok Teja) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో హెబ్బా పటేల్(Hebba Patel), వశిష్ట సింహ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్’ కు సీక్వెల్‌గా తెరకెక్కడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఏప్రిల్ 17న ‘ఓదెల-2’ థియేటర్స్‌లో రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు.

వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర కామెంట్లు చేయడంతో పాగు ‘ఓదెల-2’ విశేషాలు పంచుకుంటున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మూవీ మేకర్స్ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇందులో భాగంగా టీమ్ అందరికీ తన బెస్ట్ విషెస్ అందజేయడంతో పాటు తమన్నాను ప్రశంసలతో ముంచెత్తారు. ఆ తర్వాత మిల్కీ బ్యూటీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను శర్వానంద్‌ను కలవలేదు.. అతనితో నటించలేదు. కానీ త్వరలోనే శర్వాతో ఓ సినిమా చేయాలని ఉంది. తప్పుకుండా అతనిలో నటిస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Tags:    

Similar News