ఉగ్రరూపం దాల్చిన ’నివర్‘
దిశ, వెబ్ డెస్క్: నివర్ తుఫాన్ ఉగ్రరూపం దాల్చింది. తమిళనాడు, పుదుచ్చేరి వైపు నివర్ తుఫాన్ దూసుకెళుతోంది. ఇప్పటికే పుదుచ్చేరి, కడలూరు పోర్టుల్లో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చెన్నై,ఎన్నూర్, కారైక్కల్, నాగపట్నం పోర్టుల్లో అధికారులు 9వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పుదుచ్చేరిలో రేపటి వరకు కర్ఫ్యూను అధికారులు అమలు చేస్తున్నారు. ప్రజలు బయటకు రావొద్దని తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు విజ్ఞప్తి చేశారు. చెన్నైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు లోతట్టు […]
దిశ, వెబ్ డెస్క్: నివర్ తుఫాన్ ఉగ్రరూపం దాల్చింది. తమిళనాడు, పుదుచ్చేరి వైపు నివర్ తుఫాన్ దూసుకెళుతోంది. ఇప్పటికే పుదుచ్చేరి, కడలూరు పోర్టుల్లో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చెన్నై,ఎన్నూర్, కారైక్కల్, నాగపట్నం పోర్టుల్లో అధికారులు 9వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పుదుచ్చేరిలో రేపటి వరకు కర్ఫ్యూను అధికారులు అమలు చేస్తున్నారు. ప్రజలు బయటకు రావొద్దని తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు విజ్ఞప్తి చేశారు.
చెన్నైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పుదుకొట్టే, తంజావూరు, తిరుమరూర్, నాగపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విల్లుపురం, తిరుణ్ణామలై, చెంగల్ పట్టులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా చెన్నైలో విమాన సర్వీసులను రద్దు చేశారు. తమిళనాడు మల్లాపురం ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే మూడు ఓడ రేవులను బంద్ అధికారులు బంద్ చేశారు. నగరంలోని బ్యానర్లు, హోర్డింగ్‌లను అర్ధరాత్రిలోగా తొలగించాలని చెన్నై కార్పొరేషన్ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.