ఆరు నెలల్లో ఫ్లెక్స్ ఇంజిన్‌ల తయారీ ప్రారంభించాలి: నితిన్ గడ్కరీ!

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఆరు నెలల్లోగా బీఎస్6 నిబంధనలతో కూడిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు, ఫ్లెక్స్ ఫ్యూయెల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ఇంజిన్‌ల తయారీని ప్రారంభించాలని దేశీయ ఆటో కంపెనీలను సూచించినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఫ్లెక్స్ ఫ్యుయెల్ ఇంజిన్‌లు 100 శాతం పెట్రోల్ లేదా బయో-ఇథనాల్‌తో పనిచేస్తాయి. ఫ్లెక్స్ ఫ్యుయెల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఇంజిన్‌లు పటిష్ఠమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో పనిచేస్తాయని నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల […]

Update: 2021-12-27 09:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఆరు నెలల్లోగా బీఎస్6 నిబంధనలతో కూడిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు, ఫ్లెక్స్ ఫ్యూయెల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ఇంజిన్‌ల తయారీని ప్రారంభించాలని దేశీయ ఆటో కంపెనీలను సూచించినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఫ్లెక్స్ ఫ్యుయెల్ ఇంజిన్‌లు 100 శాతం పెట్రోల్ లేదా బయో-ఇథనాల్‌తో పనిచేస్తాయి. ఫ్లెక్స్ ఫ్యుయెల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఇంజిన్‌లు పటిష్ఠమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో పనిచేస్తాయని నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల భారత్ పెట్రోలియం దిగుమతిని తగ్గించగలదని, దీనివల్ల రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందించేందుకు దోహదపడుతుందని ఆయన అన్నారు.

రవాణా కోసం ఇథనాల్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల ప్రవేశాన్ని వేగవంతం చేసేందుకు ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్, ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్ విభాగాలను పీఎల్ఐ పథకంలోకి తీసుకొచ్చామని గడ్కరీ వివరించారు. అదే విధంగా ప్రభుత్వం థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ 2020-2025 మధ్య కాలానికి ఇథనాం బ్లెండింగ్‌కు సంబంధించిన ప్రణాళికను రూపొందించింది. రాబోయే ఐదేళ్లలో అధిక శాతం ఇథనాల్ గ్యాసోలిన్‌లో చేర్చబడుతుందని, ఫ్లెక్సీ ఇంజిన్ వాహనాలు అందుబాటులోకి రావాలని నితిన్ గడ్కరీ వెల్లడించారు.

Tags:    

Similar News