50 మంది శక్తివంతమైన మహిళల జాబితా విడుదల.. అగ్రస్థానం ఆమెదే
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఉన్న శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ అగ్రస్థానాల్లో నిలిచారు. ఫార్చున్ మ్యాగజైన్ దేశంలోనే ‘మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్’ 50 మంది జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నిర్మలా సీతారామన్ మొదటి స్థానంలో, నీతా అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, భారత్ బయోటెక్ సహ-వ్యవస్థాపకులు సుచిత్ర […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఉన్న శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ అగ్రస్థానాల్లో నిలిచారు. ఫార్చున్ మ్యాగజైన్ దేశంలోనే ‘మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్’ 50 మంది జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నిర్మలా సీతారామన్ మొదటి స్థానంలో, నీతా అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, భారత్ బయోటెక్ సహ-వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లా మొదటి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్నారు.
కొవిడ్-19 మహమ్మారి లాంటి సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక పాత్ర వహించారని ఫార్చ్యూన్ ఇండియా అభిప్రాయపడింది. ఎంఎస్ఎంఈలకు చేయూతనందించడం, ఉచిత ఆహార పంపిణీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి చర్యలు ఆమెను అగ్రస్థానంలో నిలిపాయని, అదేవిధంగా కొవిడ్ సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఆసుపత్రి, ల్యాబ్ ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా, పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కుల తయారీ లాంటి కార్యక్రమాల ద్వారా నీతా అంబానీ రెండో స్థానంలో నిలిచారని ఫార్చ్యూన్ ఇండియా తెలిపింది.
వీరి తర్వాత జాబితాలో ఆరో స్థానంలో సేల్స్‌ఫోర్స్ ఇండియా సీఈఓ అరుంధతి భట్టాచార్య, ఏడో స్థానంలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీటా గోపీనాథ్, ఎనిమిదో స్థానంలో డీఆర్‌డీఓ శాస్త్రవేత్త టెస్సీ థామన్స్, తొమ్మిదో స్థానంలో యాక్సెంచర్ సీనియర్ ఎండీ రేఖా మీనన్, పదో స్థానంలో అపోలో హాస్పిటల్స్‌కు చెందిన రెడ్డీ సిస్టర్స్ మొదటి పది స్థానాల్లో ఉన్నారు.