లాక్ డౌన్ సమాచారంతో నిర్మల్‌లో జనం తాకిడి..!

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో స్థానిక వ్యాపార వర్గాలు సమిష్టిగా తీసుకున్న లోకల్ లాక్ డౌన్ సమాచారం మేరకు సోమవారం నిర్మల్‌లో జనం పోటెత్తారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఉన్న వ్యాపార కేంద్రాల వద్ద జనం తాకిడి ఒక్కసారిగా పెరిగిపోయింది. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి దాకా జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్, నారాయణరెడ్డి మార్కెట్, కొత్త బస్టాండ్, గంగా కాంప్లెక్స్ ప్రాంతాలన్నీ విపరీతమైన జనం రద్దీతో ఇసుక వేస్తే రాలని ఈ […]

Update: 2020-08-10 11:36 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో స్థానిక వ్యాపార వర్గాలు సమిష్టిగా తీసుకున్న లోకల్ లాక్ డౌన్ సమాచారం మేరకు సోమవారం నిర్మల్‌లో జనం పోటెత్తారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఉన్న వ్యాపార కేంద్రాల వద్ద జనం తాకిడి ఒక్కసారిగా పెరిగిపోయింది.

సోమవారం సాయంత్రం నుంచి రాత్రి దాకా జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్, నారాయణరెడ్డి మార్కెట్, కొత్త బస్టాండ్, గంగా కాంప్లెక్స్ ప్రాంతాలన్నీ విపరీతమైన జనం రద్దీతో ఇసుక వేస్తే రాలని ఈ పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామాలు కరోనా ఉధృతికి మరింత కారణమవుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Tags:    

Similar News