నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు
ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. శుక్రవారం ఉదయం 5:30 నిమిషాలకు తీహార్ జైళ్లో వారికి ఉరి శిక్ష అమలు పరిచినట్టు జైళ్ల డీజీ సందీప్ గోయల్ చెప్పారు. దోషులందరిని తలారి పవన్ ఒకేసారి ఉరి తీశారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్ స్టూడెంట్ ను కదిలే బస్సులో అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తొలుత ఆరుగురిని పోలీసులు దోషులుగా గుర్తించారు. వారిలో రాంసింగ్ […]
ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. శుక్రవారం ఉదయం 5:30 నిమిషాలకు తీహార్ జైళ్లో వారికి ఉరి శిక్ష అమలు పరిచినట్టు జైళ్ల డీజీ సందీప్ గోయల్ చెప్పారు. దోషులందరిని తలారి పవన్ ఒకేసారి ఉరి తీశారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్ స్టూడెంట్ ను కదిలే బస్సులో అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తొలుత ఆరుగురిని పోలీసులు దోషులుగా గుర్తించారు. వారిలో రాంసింగ్ కొంత కాలం తర్వాత జైళ్లో ఉరేసుకుని చనిపోగా, ఒకరు మైనర్ కావటంతో జూవైనల్ హోంకు తరలించి కొంత కాలం తర్వాత విడిచిపెట్టారు. మిగిలిన ముకేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ (31)లకు శుక్రవారం ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్షను తప్పించుకునేందుకు వారు శతవిధాల ప్రయత్నించినప్పటికీ చివరికీ న్యాయ స్థానం ముందు తప్పించుకోలేకపోయారు. తీహార్ జైలులో నలుగురు వ్యక్తులకు ఒకేసారి ఉరిశిక్ష అమలు పర్చటం ఇదే తొలిసారి అని జైలు అధికారులు తెలిపారు.
Tags: nirbhaya convicts hanged, thihar jail, thalari pawan, dg sandeep goeal, early morning 5.30