నీరవ్ మోడీ ఆస్తులు జప్తు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బ్యాంకు(పీఎన్‌బీ)ను మోసం చేసి, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీకి చెందిన విలువైన ఆస్తులను ఎఫ్ఈవో చట్టం-2018 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది. ఈ ఆస్తుల విలువ రూ. 329.66 కోట్లుగా ఈడీ స్పష్టం చేసింది. తాజాగా జప్తు చేసిన ఆస్తుల్లో ముంబైలోని సముద్రా మహల్ బిల్డింగ్‌లో ఉన్న 4 ఫ్లాట్‌లు, సముద్ర తీరంలో ఉన్న ఫాంహౌస్, అలీబాగ్‌లో వ్యవసాయ భూమి, జైసల్మేర్‌లో ఉన్న విండ్ మిల్, లండన్‌లో […]

Update: 2020-07-08 07:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బ్యాంకు(పీఎన్‌బీ)ను మోసం చేసి, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీకి చెందిన విలువైన ఆస్తులను ఎఫ్ఈవో చట్టం-2018 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది. ఈ ఆస్తుల విలువ రూ. 329.66 కోట్లుగా ఈడీ స్పష్టం చేసింది. తాజాగా జప్తు చేసిన ఆస్తుల్లో ముంబైలోని సముద్రా మహల్ బిల్డింగ్‌లో ఉన్న 4 ఫ్లాట్‌లు, సముద్ర తీరంలో ఉన్న ఫాంహౌస్, అలీబాగ్‌లో వ్యవసాయ భూమి, జైసల్మేర్‌లో ఉన్న విండ్ మిల్, లండన్‌లో ఓ ఫాట్, యూఏఈలో ఒక ఫ్లాట్ సహా షేర్లు, బ్యాంక్ డిపాజిట్‌లు ఉన్నట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం ప్రకటించింది. ముంబైలోని ప్రత్యేక కోర్ట్ జూన్ 8న నీరవ్ మోడీ ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీకి అధికారాలను ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 5న ఇదే కోర్టు నీరవ్ మోడీని పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. కాగా, ఇప్పటివరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నీరవ్ మోడీకి చెందిన రూ. 2,348 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. నీరవ్ మోడీ 2019, మార్చిలో అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతం యూకే జైలులో ఉన్నాడు.

Tags:    

Similar News