బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు రూ. 7,000 కోట్ల మూలధనం!
దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో బ్యాంకుల నిరర్ధక ఆస్తులను తగ్గించేందుకు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రతిపాదన అమలులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) సహా తొమ్మిది బ్యాంకులు, రెండు నాన్-బ్యాంకింగ్ సంస్థలు సంయుక్తంగా రూ. 7,000 కోట్ల ప్రారంభ మూలధనంగా అందించనున్నట్టు తెలుస్తోంది. నిరర్ధక ఆస్తుల వ్యవహారంలో చిక్కుకున్న […]
దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో బ్యాంకుల నిరర్ధక ఆస్తులను తగ్గించేందుకు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రతిపాదన అమలులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) సహా తొమ్మిది బ్యాంకులు, రెండు నాన్-బ్యాంకింగ్ సంస్థలు సంయుక్తంగా రూ. 7,000 కోట్ల ప్రారంభ మూలధనంగా అందించనున్నట్టు తెలుస్తోంది. నిరర్ధక ఆస్తుల వ్యవహారంలో చిక్కుకున్న బ్యాంకులకు సహాయంగా ఈ నిధులను వినియోగించనున్నారు. మూలధన వాటాను అందించే బ్యాంకుల జాబితాలో ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబీ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ బ్యాంకులు మూలధాన్ని అందించడం ద్వారా బ్యాడ్ బ్యాంకులో వాటాను కలిగి ఉంటాయి.
అలాగే, ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ఐసీ యాజమాన్యంలోని ఐడీబీఐ బ్యాంకులు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక, నాన్-బ్యాంకింగ్ వాటాదారులుగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ సంస్థలు ఉంటాయి. మొత్తం 11 మంది వాటాదారులు ఒక్కొక్కరూ 9 శాతం వాటాను కలిగి ఉంటారని, అంటే దీనర్థం ఏ ఒక్క బ్యాంకు, సంస్థ కూడా 10 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండరని తెలుస్తోంది. అదేవిధంగా ఈ నిర్ణయం ద్వారా భవిష్యత్తులో బ్యాడ్ బ్యాంకులో ఎక్కువ మంది వాటాదారులను చేర్చుకునే అవకాశం ఉంది.