ఫేక్ న్యూస్ కాదు… ప్రేమను వ్యాప్తి చేద్దాం: నిధి
ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్… మూగ జీవుల ఆహారం కోసం బాధపడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తికి జంతువులు కారణమని ఫేక్ న్యూస్ ప్రచారం అవుతోందని… ముఖ్యంగా పెంపుడు జంతువుల ద్వారా కరోనా వస్తుందని భయపడేలా చేస్తున్నారని తెలిపింది. తద్వారా నోరులేని జీవాలు తిండిలేకుండా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వం జంతువులకు ఆహారాన్ని అందించేందుకు రూ. 54 లక్షల సహాయాన్ని అందించడం ఆనందంగా ఉందని తెలిపింది. అయితే క్లిష్ట సమయాల్లో సరైన సమాచారం […]
ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్… మూగ జీవుల ఆహారం కోసం బాధపడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తికి జంతువులు కారణమని ఫేక్ న్యూస్ ప్రచారం అవుతోందని… ముఖ్యంగా పెంపుడు జంతువుల ద్వారా కరోనా వస్తుందని భయపడేలా చేస్తున్నారని తెలిపింది. తద్వారా నోరులేని జీవాలు తిండిలేకుండా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వం జంతువులకు ఆహారాన్ని అందించేందుకు రూ. 54 లక్షల సహాయాన్ని అందించడం ఆనందంగా ఉందని తెలిపింది. అయితే క్లిష్ట సమయాల్లో సరైన సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యమని తెలిపింది. బీఎంజిఎఫ్ ఇండియా తరపున నేను కోరుకునేది ఒక్కటే…. @indiafactquiz కు లాగిన్ అయ్యి… సరైన సమాచారాన్ని పొందాలి. మీకు తెలిసిన కొత్త విషయాలను కూడా అక్కడ షేర్ చేసుకోవచ్చని తెలిపింది.
తన పెంపుడు కుక్క బూజోతో లాక్ డౌన్ సమయాన్ని గడుపుతున్న నిధి… బూజోకు ఇడ్లీ, టోస్ట్ అంటే ఇష్టమని తెలిపింది. తనతో నా ఆహారాన్ని షేర్ చేసుకోకపోతే ఫీల్ అవుతుందన్న నిధి… కుక్కల వల్ల వైరస్ స్ప్రెడ్ అవుతుంది అనేది అవాస్తవం అని… దయచేసి వాటిని దూరంగా పెట్టొద్దని కోరింది. ఇలాంటి సమయంలో వాటిని అవాయిడ్ చేయడం మంచిది కాదని .. దయచేసి ఫేక్ న్యూస్ కు బదులుగా ప్రేమను వ్యాప్తి చేయాలని కోరింది.