వాటిపై సమాధానం ఇవ్వండి.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ ఆదేశాలు
దిశ,వెబ్‌డెస్క్: రాయలసీమ ఎత్తి పోతల పథకంపై ఎన్జీటీలో మంగళవారం విచారణ జరిగింది. తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారించింది. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టొద్దని ఈ సంద్బంగా ఎన్జీటీ పునరుద్ఘాటించింది.కాగా పనులు జరపుతున్నారంటూ బెంచ్‌కు పిటిషనర్ తెలిపారు. దీనిపై సమాధానం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. పనులపై నిజనిర్దారదణ కమిటీని వేయాలని తెలంగాణ కోరింది. తెలంగాణ వినతిపై వివరణకు కృష్ణా […]
దిశ,వెబ్‌డెస్క్: రాయలసీమ ఎత్తి పోతల పథకంపై ఎన్జీటీలో మంగళవారం విచారణ జరిగింది. తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారించింది. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టొద్దని ఈ సంద్బంగా ఎన్జీటీ పునరుద్ఘాటించింది.కాగా పనులు జరపుతున్నారంటూ బెంచ్‌కు పిటిషనర్ తెలిపారు.
దీనిపై సమాధానం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. పనులపై నిజనిర్దారదణ కమిటీని వేయాలని తెలంగాణ కోరింది. తెలంగాణ వినతిపై వివరణకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.