ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ను కలిసిన ఎన్జీవో ప్రతినిధులు

దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జోగిని, మాతాంగి లాంటి దురాచారాలు లేని తెలంగాణ కోసం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని ఛైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ అన్నారు. దురాచారాలను రూపుమాపడానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చూపిస్తున్న చొరవ‌ను తెలుసుకున్న ఓఎమ్ఐఎఫ్ ఎన్జీవో ప్రతినిధులు గురువారం బషీర్‌బాగ్ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో జోగినీల సంక్షేమం కోసం ఎన్జీవోలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగిని స్థితిగతులపై […]

Update: 2020-07-30 09:59 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జోగిని, మాతాంగి లాంటి దురాచారాలు లేని తెలంగాణ కోసం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని ఛైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ అన్నారు. దురాచారాలను రూపుమాపడానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చూపిస్తున్న చొరవ‌ను తెలుసుకున్న ఓఎమ్ఐఎఫ్ ఎన్జీవో ప్రతినిధులు గురువారం బషీర్‌బాగ్ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో జోగినీల సంక్షేమం కోసం ఎన్జీవోలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగిని స్థితిగతులపై తమ ఎన్జీవో చేసిన సర్వే వివరాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జోగిని స్థితిగతులపై రఘునాథ్‌రావు ఆధ్వర్యంలో వేసిన వన్ మెన్ కమిషన్ రిపోర్టును ఎన్జీవోలు డేవిస్, ప్రతినిధులు హాజమ్మ, నారాయణలు చైర్మన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని జిల్లాల కలెక్టర్లకు జోగినీల వివరాలు, వారికి అందిన సంక్షేమ పథకాలు వివరాలతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని లేఖలు రాయడం జరిగిందన్నారు. జోగినీల సంక్షేమంపై పనిచేస్తున్న అన్ని ఎన్జీవోలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలియజేశారు.

Tags:    

Similar News