గణపతి చేతిలో శానిటరీ న్యాప్‌కిన్.. పీరియడ్స్‌పై అవగాహనకే
దిశ, ఫీచర్స్: ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఏ విషయంలో అయినా అవేర్‌నెస్ ఎక్కువని అనుకుంటాం. కానీ కొన్ని అచారాలను పాటించే విషయంలో వారిని నిరక్షరాస్యులుగానే భావించవచ్చు. ఎందుకంటే మెన్సెస్ టైమ్‌లో మహిళలను అపవిత్రులుగా ట్రీట్ చేసే విధానం గ్రామీణ ప్రాంతాల్లోనే కాక సివిలైజ్డ్ సొసైటీలోనూ అక్కడక్కడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అనేక స్వచ్ఛంద సంస్థలు పీరియడ్స్‌పై అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఎన్జీవో సంస్థ.. వినాయకుడి విగ్రహం రెండు చేతుల్లో శానిటరీ […]
దిశ, ఫీచర్స్: ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఏ విషయంలో అయినా అవేర్‌నెస్ ఎక్కువని అనుకుంటాం. కానీ కొన్ని అచారాలను పాటించే విషయంలో వారిని నిరక్షరాస్యులుగానే భావించవచ్చు. ఎందుకంటే మెన్సెస్ టైమ్‌లో మహిళలను అపవిత్రులుగా ట్రీట్ చేసే విధానం గ్రామీణ ప్రాంతాల్లోనే కాక సివిలైజ్డ్ సొసైటీలోనూ అక్కడక్కడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అనేక స్వచ్ఛంద సంస్థలు పీరియడ్స్‌పై అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఎన్జీవో సంస్థ.. వినాయకుడి విగ్రహం రెండు చేతుల్లో శానిటరీ న్యాప్‌కిన్స్ పెట్టి మహిళల మెన్‌స్ట్రువల్ హైజీన్ ఇంపార్టెన్స్ గురించి అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం చేసింది.
దేశవ్యాప్తంగా మహిళల్లో రుతుక్రమం పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ, శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్న ‘అనివార్య’ అనే ఎన్జీవో.. గణేశ చతుర్థి సందర్భంగా తమ ఆఫీస్‌లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం రెండు చేతుల్లోనూ శానిటరీ న్యాప్‌కిన్స్ ఉంచి, మెన్‌స్ట్రువల్ హైజీన్‌ను ప్రమోట్ చేయడంలో వినాయకుడిని బాధ్యతగల భర్తగా చిత్రీకరించింది. అంతేకాదు ఆచారం ప్రకారం విఘ్నేశుడికి ఇరువైపులా ఆయన భార్యలు ‘సిద్ధి, బుద్ధి’ ప్రతిమలను కూడా ఏర్పాటు చేసింది. కాగా ఈ ఎన్జీవో ఏప్రిల్ 2020 నుంచి ఇప్పటివరకు 20 లక్షల శానిటరీ ప్యాడ్స్‌ను డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. ‘అనివార్య’ వ్యవస్థాపకుడు అంకిత్ బాగ్ది.. రుతుక్రమ సమస్యలపై మహిళలకు స్వేచ్ఛను కల్పించేందుకు పండుగ నేపథ్యాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.
అయితే, ఈ విషయంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మెన్‌స్ట్రువల్ హైజీన్‌పై అవగాహన కల్పిస్తున్న ఎన్జీవో ‘అనివార్య’ లక్ష్యాలు మంచివే అయినప్పటికీ.. అందుకోసం అనేక మార్గాలున్నాయని అంటున్నారు. ఇదేరకంగా వర్జిన్ మేరీ లేదా ఫాతిమా బింట్ ముహమ్మద్‌కు చేయగలరా? అని ప్రశ్నిస్తున్నారు. మహిళల్లో పీరియడ్స్ సహజమే, శానిటరీ న్యాప్‌కిన్స్ ఉపయోగించడం మంచిదే. కానీ దేవుడి ప్రమేయం లేకుండా వీటి వినియోగాన్ని ప్రోత్సహించే మార్గాలున్నాయి కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.