ఇండియా నుంచి రాకపోకలపై న్యూజిలాండ్ నిషేధం

వెల్లింగ్టన్: మనదేశం నుంచి రాకపోకలపై న్యూజిలాండ్ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడర్న్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లాలనుకునే ఆ దేశ వాసులకూ ఈ నిబంధన వర్తిస్తుందని వివరించారు. ఈ నెల 11 నుంచి 28వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. ఈలోగా సురక్షితంగా రాకపోకలు నిర్వహించడానికి మార్గాలను అన్వేషిస్తామని వివరించారు. కరోనా కట్టడిలో గతేడాది న్యూజిలాండ్ […]

Update: 2021-04-07 22:24 GMT

వెల్లింగ్టన్: మనదేశం నుంచి రాకపోకలపై న్యూజిలాండ్ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడర్న్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లాలనుకునే ఆ దేశ వాసులకూ ఈ నిబంధన వర్తిస్తుందని వివరించారు. ఈ నెల 11 నుంచి 28వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. ఈలోగా సురక్షితంగా రాకపోకలు నిర్వహించడానికి మార్గాలను అన్వేషిస్తామని వివరించారు. కరోనా కట్టడిలో గతేడాది న్యూజిలాండ్ ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఇక్కడ వారానికి సగటున ఐదు కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Tags:    

Similar News