బ్రేకింగ్ న్యూస్.. పెండ్లయిన ఐదో రోజే నవదంపతులు గల్లంతు

దిశ, వికారాబాద్: భారీ వర్షాలు, వరదలు నవ దంపతులను గల్లంతు చేశాయి. గత మూడు రోజులుగా వికారాబాద్ జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇదే సమయంలో కొత్తగా పెండ్లి చేసుకున్న దంపతులు అందులో గల్లంతు కావడం సంచలనం రేపుతోంది. మర్పల్లి మండల పరిధి రావుల గ్రామానికి చెందిన నవ దంపతులు నవాజ్‌ రెడ్డి, భార్య ప్రవళిక. వీరిద్దరికి ఈ నెల 25న వివాహం జరిగింది. పెండ్లి వేడుకలో […]

Update: 2021-08-29 10:44 GMT

దిశ, వికారాబాద్: భారీ వర్షాలు, వరదలు నవ దంపతులను గల్లంతు చేశాయి. గత మూడు రోజులుగా వికారాబాద్ జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇదే సమయంలో కొత్తగా పెండ్లి చేసుకున్న దంపతులు అందులో గల్లంతు కావడం సంచలనం రేపుతోంది.

మర్పల్లి మండల పరిధి రావుల గ్రామానికి చెందిన నవ దంపతులు నవాజ్‌ రెడ్డి, భార్య ప్రవళిక. వీరిద్దరికి ఈ నెల 25న వివాహం జరిగింది. పెండ్లి వేడుకలో భాగంగానే ఆదివారం మోమిన్‌పేట నుంచి రావులపల్లికి బయల్దేరారు. ఇదే సమయంలో భారీ వర్షం కారణంగా తిమ్మాపూర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహించింది. సరిగ్గా ఇదే సమయంలో ఆ వాగు వెంబడి రోడ్డుపై కూడా వరద ఉధృతి పెరగడంతో కారు నీటి ప్రవహానికి కొట్టుకుపోయింది. నవదంపతులతో పాటు కారులో డ్రైవర్, నవాజ్ రెడ్డి అక్కలు శృతి, రాధమ్మ ఉన్నట్టు కుటుంబీకులు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. నవాజ్‌, అతడి సోదరి సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. నవ వధువుతో పాటు మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. అంతేకాకుండా.. శంకర్‌పల్లిలో ఒకరు, నవాబ్‌పేట్ మండలంలో మరొకరు వరద నీటిలో కొట్టుకుపోవడం గమనార్హం.

Tags:    

Similar News