పెళ్లైన కొత్తలో.. 20 రోజులు ప్రియుడితో
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు దీనిమీదే. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్ అంటూ ఫోన్ లోనే ఉంటున్నారు. అయితే ఈ సోషల్ మీడియా మోజు విపరీతంగా పెరిగి కాపురాల్లో చిచ్చుపెడుతుంది. బంధాలను దూరం చేస్తుంది. తాజాగా తెలిసీతెలియక ఫేస్‌బుక్ లో ఓ వివాహిత చేసిన స్నేహం, అపరిచిత వ్యక్తిపై ఆమె చూపించిన ప్రేమ చివరికి ఆమె కొత్త కాపురంలో చిచ్చు […]
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు దీనిమీదే. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్ అంటూ ఫోన్ లోనే ఉంటున్నారు. అయితే ఈ సోషల్ మీడియా మోజు విపరీతంగా పెరిగి కాపురాల్లో చిచ్చుపెడుతుంది. బంధాలను దూరం చేస్తుంది. తాజాగా తెలిసీతెలియక ఫేస్‌బుక్ లో ఓ వివాహిత చేసిన స్నేహం, అపరిచిత వ్యక్తిపై ఆమె చూపించిన ప్రేమ చివరికి ఆమె కొత్త కాపురంలో చిచ్చు పెట్టిన ఘటన హన్మకొండ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ఓ యువతికి నాలుగు నెలల క్రితం వివాహమైంది.
భర్తతో కొత్త కాపురం మొదలుపెట్టిన యువతి భర్త ఆఫీస్ కి వెళ్ళాక ఫోన్ తో కాలక్షేపం చేస్తూ ఉండేది ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ లో ఆమెకు వనపర్తి జిల్లాకు చెందిన సందీప్ పరిచయమయ్యాడు. గ్రామంలో ట్రాక్టర్ నడుపుతూ ఉండే సందీప్ ఆమెతో చనువుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. చాటింగ్ కాస్తా వీడియో కాల్స్ వరకు వెళ్ళింది. భర్త ఆఫీస్ కి వెళ్లడం ఆలస్యం వివాహిత సందీప్ తో గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతుండేది. ఇలా కొన్ని రోజులు గడిచాక భర్త కన్నా ఫేస్‌బుక్ ప్రియుడే కావాలనుకొంది. భర్తను వదిలి ప్రియుడు కోసం అతడు ఉంటున్న గ్రామానికి వెళ్లింది. ఇది తప్పు అని వారించాల్సిన సందీప్ సైతం ఆమెను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. గత 20 రోజులనుండి వారిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని తెలుసుకున్న వివాహిత తల్లి ఇంటికి రమ్మని పిలిచినా, ఆమె నిరాకరించడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.