కివీస్ విజయం నల్లేరు మీద నడకే
దిశ, వెబ్‌డెస్క్: రెండో టెస్ట్‌లోనూ న్యూజిలాండ్ విజయం లాంఛనమే. ఓవర్ నైట్ స్కోర్ 90/6తో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ మరో 34 పరుగులు జోడించి 124 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని 132 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ విజయం దిశగా సాగుతోంది. ఓపెనర్లు లామ్ లాథమ్ (35), బ్లండెల్ (31) సంయోచితంగా ఆడుతున్నారు. ప్రస్తుతం కివీస్ 20 ఓవర్లకు 70/0 పరుగులు చేసింది. […]
దిశ, వెబ్‌డెస్క్: రెండో టెస్ట్‌లోనూ న్యూజిలాండ్ విజయం లాంఛనమే. ఓవర్ నైట్ స్కోర్ 90/6తో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ మరో 34 పరుగులు జోడించి 124 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని 132 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ విజయం దిశగా సాగుతోంది. ఓపెనర్లు లామ్ లాథమ్ (35), బ్లండెల్ (31) సంయోచితంగా ఆడుతున్నారు. ప్రస్తుతం కివీస్ 20 ఓవర్లకు 70/0 పరుగులు చేసింది.
అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆదిలోనే విహారిని(9) సౌథీ ఔట్ చేశాడు. అనంతరం రిషబ్ పంత్ (4), షమి (5) వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. బుమ్రా 4 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌కు 124 పరుగుల వద్ద తెరపడింది.