తక్కువ సమయంలో టెస్టులు ఆడటం కష్టం : కివీస్ మాజీ కోచ్

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ జట్టు అతి తక్కువ సమయంలో టెస్టు మ్యాచ్‌లు ఆడుతుండటం వల్ల క్రికెటర్లపై భారం పడే అవకాశం ఉన్నదని ఆ జట్టు మాజీ కోచ్ మైక్ హెసన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడి వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం న్యూజీలాండ్ జట్టుకు పెద్ద నష్టమేనని అన్నాడు. కేవలం నాలుగు రోజుల తర్వాత మూడు టెస్టులు ఆడటం వల్ల న్యూజీలాండ్ ప్లేయర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని.. అందుకే తొలి టెస్టులో ట్రెంట్ బౌల్ట్‌కు విశ్రాంతి […]

Update: 2021-06-09 10:34 GMT

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ జట్టు అతి తక్కువ సమయంలో టెస్టు మ్యాచ్‌లు ఆడుతుండటం వల్ల క్రికెటర్లపై భారం పడే అవకాశం ఉన్నదని ఆ జట్టు మాజీ కోచ్ మైక్ హెసన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడి వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం న్యూజీలాండ్ జట్టుకు పెద్ద నష్టమేనని అన్నాడు. కేవలం నాలుగు రోజుల తర్వాత మూడు టెస్టులు ఆడటం వల్ల న్యూజీలాండ్ ప్లేయర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని.. అందుకే తొలి టెస్టులో ట్రెంట్ బౌల్ట్‌కు విశ్రాంతి ఇచ్చారని హెసన్ చెప్పారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు న్యూజీలాండ్‌కు మంచి ప్రాక్టీసే లభించింది. అయితే కేవలం ప్రతీ టెస్టుకు మధ్యలో నాలుగు రోజులే గ్యాప్ ఉండటం వల్ల తీవ్రంగా అలసిపోతారని ఆయన అన్నారు. టీమ్ ఇండియా మయాంక్ అగర్వాల్‌తో ఓపెనింగ్ చేయించడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. రోహిత్ శర్మ, శుభమన్ కాంబినేషన్ కంటే మయాంగ్‌ను తీసుకోవడం వల్ల ఇంగ్లాండ్‌లోని బౌన్సీ పిచ్‌లపై పేసర్లను ఎదుర్కోగలడని ఆయన చెప్పారు.

Tags:    

Similar News