తెలంగాణ మంత్రుల్లో టెన్షన్.. టెన్షన్!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ వచ్చేనెలలో బాధ్యతలు స్వీకరిస్తారని మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కోడై కూస్తున్న తరుణంలో మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. సీఎం సీటును కేటీఆర్ అధిష్ఠించాక ప్రజెంట్ కేబినెట్‌ను మార్చేస్తాడా ! లేకుంటే కేసీఆర్ కేబినెట్‌కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పరిపాలనా పనులు చూసుకుంటాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నవారికి కొత్త భయం పట్టుకుంది. ఒకవేళ కేటీఆర్ కొత్త టీమ్ రెడీ చేసుకుంటే అందులో మనం […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ వచ్చేనెలలో బాధ్యతలు స్వీకరిస్తారని మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కోడై కూస్తున్న తరుణంలో మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. సీఎం సీటును కేటీఆర్ అధిష్ఠించాక ప్రజెంట్ కేబినెట్‌ను మార్చేస్తాడా ! లేకుంటే కేసీఆర్ కేబినెట్‌కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పరిపాలనా పనులు చూసుకుంటాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నవారికి కొత్త భయం పట్టుకుంది. ఒకవేళ కేటీఆర్ కొత్త టీమ్ రెడీ చేసుకుంటే అందులో మనం ఉంటామా ! ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేస్తే మన కుర్చీకి ఎసరు వస్తుందా ? అన్న బెంగతో ఉన్నారు మంత్రులు.
ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్‌లో ఆయనకు అత్యంత సన్నిహితులతో పాటు జిల్లాలు, కులాల ప్రాతిపదికన మంత్రులు ఉన్నారు. పేరుకు అక్కడ కేసీఆరే సీఎం అయినా అన్ని శాఖలకు సంబంధించి కేటీఆరే గతంలో రివ్యూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఏమంత్రి పనితీరు ఎలా ఉంటుందో కేటీఆర్‌కు పక్కా తెలుసు. సీఎం అయ్యాక కూడా తండ్రికి మించి పాలన ఉండాలంటే, అందులోనూ తన మార్క్ చూపించుకోవాలంటే కేబినెట్‌లో సైతం తనకు అనుకూలంగా ఉండి, అసంతృప్తులను బుజ్జగిస్తూ జిల్లాల్లో చక్రం తిప్పేవాళ్లను టీమ్‌గా ఏర్పాటు చేసుకోవాల్సిందే. వీటన్నింటికి సంబంధించి కేసీఆర్, కేటీఆర్ టీమ్‌లు వ్యూహాలు అమలు చేస్తుందన్న ప్రగతిభవన్ వర్గాల సమాచారంతో కేటీఆర్‌కు దగ్గరయ్యేందుకు ప్రజెంట్ మంత్రులతో పాటు పార్టీ నేతలు కేటీఆర్ పల్లవిని అందుకొని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఉమ్మడి జిల్లాల పరంగా చూసుకుంటే కేటీఆర్‌కు జిల్లాకొకరు అత్యంత సన్నిహితులు ఉన్నారు. వారిలో కొందరు ఇప్పుడు కేసీఆర్ కేబినెట్‌లో కొనసాగుతున్నారు. అయితే తాను సీఎంగా అయ్యాక వీరిని అలాగే కొనసాగిస్తాడా లేకుంటే, బుజ్జగించి 2023 ఎన్నికల్లో మంచి పదవుల ఆఫర్‌తో అసంతృప్తికి గురికాకుండా చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత మంత్రుల్లో కొందరిపై తీవ్ర విమర్శలు వచ్చి, కేబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగినా కేసీఆర్ మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు. కొందరు వ్యక్తిగతంగా చేసిన తలంపులు పార్టీకి చెడ్డపేరు తెచ్చినా మంత్రులతోనే ఫోన్‌లో మాట్లాడి మళ్లీ ఇలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవాలని చిన్న చురకలు అంటించి వదిలేశాడు.
కానీ ఇప్పుడు వచ్చేది కేటీఆర్. మరి అలాంటి మంత్రులను తన టీమ్‌లో చేర్చుకుంటాడా లేకుంటే నమస్కారం చెప్పి, నామినేటెడ్ పోస్టుతో ఫీల్ కాకుండా చూస్తాడా అన్నది జరగబోయే పరిణామమే. ఓవైపు కేటీఆర్ సీఎం కావాలని మంత్రులంతా ఆకాశానికి ఎత్తుతుంటే, ఆయన మాత్రం ఎవరిపై దయ తలుస్తాడో, లేకుంటే ఈక్వేషన్స్ పేరు చెప్పి ఎగనామం పెడుతాడా అన్నది మంత్రుల్లో గుబులు పుట్టిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ సీఎం అయితే కొందరికి గుడ్ డేస్.. మరికొందరికి బ్యాడ్ డేస్ మొదల్వడం పక్కా.