ఉల్లి జాతిలో కొత్త మొక్క ‘అల్లియం నెగియానమ్’
దిశ, ఫీచర్స్: 2019లో ఉత్తరాఖండ్‌లో కనుగొన్న ఒక కొత్త జాతి మొక్కను ‘అల్లియం’ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి 1,100 జాతుల్లో ఇదోక రకమైన జాతిగా పరిగణిస్తూ దీనికి సంబంధించిన విశేషాలు ఫైటోకీస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 2019లో న్యూ ఢిల్లీలోని ICAR- నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ అంజూలా పాండే, శాస్త్రవేత్తలు డాక్టర్ కె. మాధవ్ రాయ్, పవన్ కుమార్ మలవ్, రాజ్‌కుమార్‌తో కలిసి, ఉత్తరాఖండ్‌లోని […]
దిశ, ఫీచర్స్: 2019లో ఉత్తరాఖండ్‌లో కనుగొన్న ఒక కొత్త జాతి మొక్కను ‘అల్లియం’ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి 1,100 జాతుల్లో ఇదోక రకమైన జాతిగా పరిగణిస్తూ దీనికి సంబంధించిన విశేషాలు ఫైటోకీస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
2019లో న్యూ ఢిల్లీలోని ICAR- నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ అంజూలా పాండే, శాస్త్రవేత్తలు డాక్టర్ కె. మాధవ్ రాయ్, పవన్ కుమార్ మలవ్, రాజ్‌కుమార్‌తో కలిసి, ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని మలారి గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఈ ఉల్లిపాయ జాతికి చెందిన మొక్కలను చూశారు. దీనికి వారు ‘అల్లియం’ అని పేరు పెట్టారు. సాధారణంగా ఈ మొక్కలు సముద్ర మట్టానికి 3,000 నుంచి 4,800 మీటర్ల ఎత్తులో పెరుగుతాయి. ఈ జాతి పశ్చిమ హిమాలయాల ప్రాంతానికి పరిమితం కాగా, అల్లియం ప్రాథమిక పరిణామ కేంద్రం ఇరానో-టురేనియన్ బయో-జియోగ్రాఫికల్ రీజియన్‌లో విస్తరించి ఉంది. వీటికి మధ్యధరా బేసిన్, పశ్చిమ ఉత్తర అమెరికాలు ద్వితీయ కేంద్రాలుగా పరిగణించారు. అల్లియం అనే కొత్త జాతికి ఇచ్చిన శాస్త్రీయ నామం అల్లియం నెగియానమ్ కాగా అన్వేషకుడు అల్లియం కలెక్టర్ అయిన దివంగత డాక్టర్ కుల్దీప్ సింగ్ నేగి పేరు దీనికి పెట్టారు.
దేశీయ సాగులో ప్రసిద్ధి
సైన్స్‌కి కొత్తది అయినప్పటికీ, అల్లియం నెగియానమ్ అనేది స్థానిక కమ్యూనిటీలకు దేశీయ సాగు కింద చాలా కాలంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటివరకు పశ్చిమ హిమాలయ ప్రాంత వాసులు మసాలా దినుసుల కోసం దాని ఆకులు, పువ్వులను విచక్షణారహితంగా కోయడం వల్ల దాని సంతతికి ఎక్కువ ముప్పు వాటిల్లుతుందని పరిశోధకులు భయపడుతున్నారు. హిమాలయాల్లోని సమశీతోష్ణ, ఆల్పైన్ ప్రాంతాల్లో పండించిన వాటిని మినహాయించి 10 కంటే ఎక్కువ ఉపజాతులు 35- 40 ప్రధాన జాతులు ఇండియన్ అల్లియంలో ఉన్నాయి.