ఇక ఆ సమస్య తీరినట్లే.. ధరణిలో కొత్త ఆప్షన్
దిశ, తెలంగాణ బ్యూరో: భూ పరిపాలనలో మరో కొత్త ఆప్షన్ వచ్చింది. ధరణి పోర్టల్‌లో 31వ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. దీంతో పట్టాదారు పేరుకు బదులుగా హౌజ్/హౌజ్‌సైట్ అని పడినవారికి ఊరట లభించనుంది. ఈ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిదిద్దనున్నారు. ఏదేని సర్వే నంబరులోని కొంత విస్తీర్ణం నాలా కన్వర్షన్ చేస్తే.. మొత్తాన్ని నాలా అని, హౌజ్‌సైట్ అని నమోదు చేస్తున్నారు. అలాంటి వారి పట్టాదారు పాసు పుస్తకాల్లో సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మీ సేవా […]
దిశ, తెలంగాణ బ్యూరో: భూ పరిపాలనలో మరో కొత్త ఆప్షన్ వచ్చింది. ధరణి పోర్టల్‌లో 31వ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. దీంతో పట్టాదారు పేరుకు బదులుగా హౌజ్/హౌజ్‌సైట్ అని పడినవారికి ఊరట లభించనుంది. ఈ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిదిద్దనున్నారు. ఏదేని సర్వే నంబరులోని కొంత విస్తీర్ణం నాలా కన్వర్షన్ చేస్తే.. మొత్తాన్ని నాలా అని, హౌజ్‌సైట్ అని నమోదు చేస్తున్నారు. అలాంటి వారి పట్టాదారు పాసు పుస్తకాల్లో సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మీ సేవా కేంద్రం నుంచి యాజమాన్యపు ఆధారాలు, ల్యాండ్ ఫోటో లేదా వీడియో వంటివి సమర్పించాలి. దరఖాస్తుదారుడికి సంక్షిప్త సమాచారం వస్తుంది. మీ సేవా కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు కలెక్టర్‌కు వెళ్తుంది. ఆయన పరిశీలించి ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేస్తారు. ఆమోదిస్తే పట్టాదారు పాసు పుస్తకం ఇంటికే వస్తుంది.