4జీ సిమ్‌తో ల్యాప్‌టాప్
దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి HP కంపెనీ శుభవార్త అందించింది. హెవ్ లెట్ ప్యాకర్డ్ -HP ఇటీవల లాంఛ్ చేసిన 14ఎస్ నోట్‌బుక్ ఓసారి చెక్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ లేదా డాంగిల్ అవసరం లేకుండానే మీ దగ్గరున్న 4జీ సిమ్ కార్డుతో ఈ ల్యాప్‌టాప్‌ను వినియోగించవచ్చు. 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీతో హెచ్‌పీ 14ఎస్ ల్యాప్‌టాప్‌ను ఆ కంపెనీ రూపొందించింది. ఇందులో స్టాండ్ బైగా 4జీ సిమ్ కార్డు వేసుకుంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేని […]
దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి HP కంపెనీ శుభవార్త అందించింది. హెవ్ లెట్ ప్యాకర్డ్ -HP ఇటీవల లాంఛ్ చేసిన 14ఎస్ నోట్‌బుక్ ఓసారి చెక్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ లేదా డాంగిల్ అవసరం లేకుండానే మీ దగ్గరున్న 4జీ సిమ్ కార్డుతో ఈ ల్యాప్‌టాప్‌ను వినియోగించవచ్చు. 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీతో హెచ్‌పీ 14ఎస్ ల్యాప్‌టాప్‌ను ఆ కంపెనీ రూపొందించింది. ఇందులో స్టాండ్ బైగా 4జీ సిమ్ కార్డు వేసుకుంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేని ప్రాంతంలో 4జీ డేటాతో ల్యాప్‌టాప్‌ను ఉపయోగించొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో లేదా ట్యాబ్లెట్‌లో సిమ్ కార్డు ద్వారా డేటా ఎలా ఉపయోగిస్తామో ఆ విధంగా అన్నమాట. ఇంటర్నెట్ కనెక్షన్, డాంగిల్ కూడా అవసరం లేదు. ఏ నెట్వర్క్ సిమ్ కార్డు అయినా ఈ లాప్‌ట్యాప్ పనిచేస్తుంది. కాకపోతే, 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీ ఉండాలి. వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి, ఎక్కువగా ట్రావెల్ చేసేవారికి ఈ ల్యాప్‌టాప్ బాగా ఉపయోగపడుతుంది.
హెచ్‌పీ 14ఎస్ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.44,999. స్పెసిఫికేషన్స్ చూస్తే ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ కెపాసిటీతో అందుబాటులోకి వచ్చింది. ఇంటెల్ కోర్ ఐ5 10వ జనరేషన్ ప్రాసెసర్‌తో 8 జీబీ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్. ఇంటెల్ ఎక్స్ఎంఎం 7360 4జీ ఎల్‌టీఈ6, 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 41Wh లిథియం అయాన్ బ్యాటరీ, బ్లూటూత్ v5.0, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ సీపోర్ట్, రెండు యూఎస్‌బీ టైప్-ఏ పోర్ట్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 1టీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో కొనొచ్చు. 4జీ సిమ్ కార్డు కోసం ప్రత్యేకంగా స్లాట్ కూడా ఉంది.